Bigg Boss Season 6: బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పారితోషికం ఎంతో చెప్పేసిన షాని?

ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6, 21 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే

  • Written By:
  • Updated On - September 21, 2022 / 05:19 PM IST

ఇటీవలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 6, 21 మంది కంటెస్టెంట్ లతో గ్రాండ్ గా మొదలైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఇద్దరు కంటెస్టెంట్లు కూడా ఎలిమినేట్ అయ్యారు. వారిలో ఒకరు షాని సాల్మన్ కాగా, మరొకరు అభినయశ్రీ. ఇదే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లోకి 19 మంది మాత్రమే మిగిలారు. ఇక ఇది ఇలా ఉంటే మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ ల రెమ్యూనరేషన్ కు సంబంధించి అనేక రకాల వార్తలు వినిపిస్తూ ఉంటాయి. అయితే ఇంతవరకు ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ లు గాని గెలిచిన కంటెస్టెంట్లు కానీ రెమ్యూనరేషన్ గురించి బయట పెట్టలేదు. గత సీజన్లలో వారానికి లక్షలు అందుకున్న కంటిస్టెంట్ లు కూడా ఉన్నారు.

కానీ ఇటీవల మొదలైన బిగ్ బాస్ సీజన్ 6 లోని కంటెస్టెంట్లకు చాలా తక్కువ పారితోషికాలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్లకు సంబంధించిన రెమ్యూనరేషన్ గురించి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ షానీ సాల్మన్ చెప్పుకొచ్చాడు. ఈ సందర్భంగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న షానీ మాట్లాడుతూ.. బిగ్ బాస్ రెమినరేషన్ గురించి అడగగా బయటకు చెప్పొద్దు అన్నారు కానీ వారం లెక్కన పేమెంట్ ఇస్తారు. ఎన్ని వారాలు ఉంటే అంత పేమెంట్ వస్తుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ కి ఎక్కువ రెమినేషన్ ఇచ్చి ఉంటారు ఎందుకంటే తెలిసిన సెలబ్రిటీ అతనే కాబట్టి అని తెలిపాడు షాని.

సింగర్ రేవంత్ కి వారానికి 65,000 చొప్పున అత్యధిక రెమ్యూనరేషన్ ఇస్తున్నారట. అలాగే బాలాదిత్య కి 55,000 రోహిత్,మెరీనా,చంటి, శ్రీహన్ లకు 50,000 రెమ్యూనరేషన్ ఇస్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక హౌస్లో అందరికంటే అతి తక్కువ రెమ్యూనరేషన్ ఇనయా, రాజశేఖర్ లకు వారానికి 15000 చొప్పున అందిస్తున్నట్లు తెలుస్తోంది.