Shaakuntalam Trailer: శ‌కుంతల కార‌ణ జ‌న్మురాలు, ఒక న‌వ నాగ‌రిక చ‌రిత్ర‌కు నాంది!

సమంత (Shaakuntalam) సినిమా ట్రైలర్ కొద్దిసేపటి క్రితమే విడుదలైంది. గొప్ప విజువల్ ఫీస్ట్ తో ఆకట్టుకుంటోంది.

  • Written By:
  • Updated On - January 9, 2023 / 01:37 PM IST

టాలీవుడ్ నటి సమంత (Samantha) యశోద సినిమా తర్వాత ప్రతిష్టాత్మకమైన శాకుంతలం (Shaakuntalam) మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మేకర్స్ ట్రైల‌ర్‌ను సోమ‌వారం రిలీజ్ చేశారు. విజువ‌ల్ ఫీస్ట్‌గా ఈ ట్రైల‌ర్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది. స‌మంత టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్నసినిమా శాకుంత‌లం. మ‌హాభార‌తంలోని శ‌కుంత‌ల‌, దుష్యంతుల ప్ర‌ణ‌య‌గాథ ఆధారంగా మైథ‌లాజిక‌ల్ ల‌వ్ స్టోరీగా ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్ శాకుంత‌లం సినిమాను తెర‌కెక్కిస్తోన్నారు. ఈ భూమి మీద అమ్మ‌నాన్న‌ల‌కు అక్క‌ర‌లేని తొలి బిడ్డ మేన‌క విశ్వామిత్రుల ప్రేమ‌కు గుర్తుగా ఈ పాప పుట్టింది అనే డైలాగ్‌తో శాకుంత‌లం (Shaakuntalam) ట్రైల‌ర్ ప్రారంభ‌మైంది. శ‌కుంతల కార‌ణ జ‌న్మురాలు, ఒక న‌వ నాగ‌రిక చ‌రిత్ర‌కు నాంది ప‌ల‌క‌బోతున్న‌ది అనే డైలాగ్‌తో దుష్యంతుడిగా దేవ్ మోహ‌న్ క‌నిపించాడు.

చెలిక‌త్తెలు శ‌కుంత‌ల‌ కోసం వెతుకుతుండ‌టం, అదే స‌మ‌యంలో దుష్యంతుడు ఆమెను చూసి మైమ‌ర‌చిపోయే సీన్‌తో స‌మంత ను ట్రైల‌ర్‌లో చూపించారు. స్వ‌చ్ఛ‌మైన త‌న ప్రేమ కోసం దుర్వాసుడి ఆగ్ర‌హానికి, క‌శ్య‌ప మ‌హ‌ర్షి అనుగ్రాహానికి మ‌ధ్య ఆమె ప‌డే క‌ష్టాలు భూమాత‌కు సైతం భార‌మే అనే డైలాగ్‌తో స‌మంత ప్రేమ‌కు ఎదుర‌య్యే క‌ష్టాలు చూపించారు. త‌న‌ను ప్రాణంగా ప్రేమించిన దుష్యంతుడే ఎవ‌రో తెలియ‌ద‌ని చెప్పే డైలాగ్ ఆస‌క్తిని పంచుతోంది. ప్రేమ‌తో పాటు యుద్ధ స‌న్నివేశాల‌ను ట్రైల‌ర్‌లో చూపించారు. ట్రైల‌ర్ చివ‌ర‌లో అల్లు అర్జున్ త‌న‌య అల్లు అర్హ‌ను క‌నిపించింది. శ‌కుంత‌ల‌ (Shaakuntalam) గా స‌మంత లుక్‌, న‌ట‌న ఆక‌ట్టుకుంటున్నాయి.

మహాశివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 17న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, హిందీ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. ఆ రోజు ధనుష్ ‘సార్’, విశ్వక్ సేన్ ‘దాస్ కా ధమ్కీ’, కిరణ్ అబ్బవరం ‘వినరో భాగ్యము విష్ణు కథ’ సినిమాలు కూడా ఉన్నాయి. అయితే.. అందరి చూపు సమంత (Samantha) సినిమాపై ఉందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.