Site icon HashtagU Telugu

Pooja Hegde Pics: శారీలోనూ సెక్సీ లుక్స్.. పూజా హెగ్డే లేటెస్ట్ పిక్స్ వైరల్!

Pooja Hegde

Pooja Hegde

బికినీ (Bikini) టాప్, స్లిమ్ సూట్, హాఫ్ శారీ, శారీ, డీప్ నెక్.. ఏ డ్రస్సు ధరించినా టాలీవుడ్ బుట్టబొమ్మ (Pooja Hegde)కు అతికినట్టుగా సరిపోతోంది. ఒక్కమాటలో చెప్పాలంటే వేసుకున్న డ్రస్సుకు కొత్త అందాలను తీసుకోస్తోంది ఈ బ్యూటీ. ఇటీవల గాయం నుంచి రికవరీ పూజ మళ్లీ సెట్స్ లో అడుగుపెట్టింది. పూజ (Pooja Hegde) ఇటీవల తన తాజా ఫోటోషూట్ నుండి అందమైన ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

పసుపు (Yellow) పట్టు చీరలో అందంగా ఉంది. నీలం రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో ఫిదా చేస్తోంది. పూజ మినిమలిస్టిక్ మేకప్‌ని ఎంచుకుంది. జుట్టును ఎత్తైన బన్‌లో కట్టి, దానికి మల్లెపూలతో గజ్రా కట్టింది. మ్యాచింగ్ బ్యాంగిల్స్‌, మ్యాచింగ్ ఇయర్స్ రింగ్స్ తో కట్టిపడేస్తోంది. ఆ ఫోటోలు వైరల్ (Viral Pics) అయ్యాయి. “అందం” అని కామెంట్ చేయగా, మరొకరు “వరల్డ్ గ్రేటెస్ట్ బ్యూటీ” అని కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఈ బ్యూటీకి ఈ ఏడాది ఏమాత్రం కలిసిరాలేదు. రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. కానీ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన కామెడీ చిత్రం F3లో పూజ (Pooja Hegde) తన ప్రత్యేక పాటతో దృష్టిని ఆకర్షించింది. ఈ చిత్రం కమర్షియల్ విజయాన్ని సాధించింది.

ఇక రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన హిందీ చిత్రం సర్కస్‌లో పూజ రణవీర్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌లతో కలిసి కనిపించనుంది. ఈ చిత్రం విలియం షేక్స్‌పియర్ నాటకం, ది కామెడీ ఆఫ్ ఎర్రర్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. క్రిస్మస్ తో పాటు డిసెంబర్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ విడుదలకు రెడీగా ఉంది. ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’లో సల్మాన్ ఖాన్‌ (Salman Khan)తో కలిసి కనిపించనుంది. ఈ యాక్షన్-కామెడీ చిత్రానికి ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించారు. తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన SSMB 28 లో కూడా పూజా  నటిస్తోంది.