Site icon HashtagU Telugu

Siddharth’s Takkar Teaser: సెక్స్ అయితే ఓకే కానీ.. ప్రేమ, పెళ్లి వద్దు!

Takkar

Takkar

మహాసముద్రం (Mahasamudram)లో చివరిసారిగా కనిపించిన హీరో సిద్ధార్థ్ (Siddharth) టక్కర్ (Takkar) అనే కొత్త చిత్రంతో వస్తున్నాడు. దీనికి కార్తీక్ జి క్రిష్ అనే వ్యక్తి మెగాఫోన్ పట్టాడు. మజిలీ ఫేం దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటించిన ఈ సినిమా టీజర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. హీరో సిద్ధార్థ్ ఇండిపెండెంట్ లక్షణాలున్న అమ్మాయి (దివ్యాంశ)తో గాఢమైన ప్రేమలో పడతాడు. ఆమె కోసం ఎంతకైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు. అయితే హీరోతో రొమాన్స్ (Romance) చేయడానికి ఎలాంటి అడ్డు చెప్పని అమ్మాయి ప్రేమ, పెళ్లికి మాత్రం నో చెబుతుంది.

సినిమాలో ప్రేమ, శృంగారం (Sex) తప్ప మరో కోణం కూడా బయటపెట్టలేదు. అయితే సినిమాలో యాక్షన్ డోస్ బాగానే ఉంటుందని తెలుస్తోంది. సిద్ధార్థ్ యవ్వనంగా (Young) కనిపించడంతో పాటు తన పాత్రను అద్భుతంగా పోషించాడు. దివ్యాన్ష బోల్డ్ (Bold) పాత్రలో నటించి ఆశ్చర్యపరిచింది. ‘‘నాకు సెక్స్ అయితే కానీ.. ఈ ప్రేమ, పెళ్లి వద్దు’’ అనే డైలాగ్ ఆసక్తిని రేపుతోంది. ఈ చిత్రానికి నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా, వాంచినాథన్ మురుగేశన్ సినిమాటోగ్రఫీ అందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, ప్యాషన్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 26న విడుదల కానుంది.

Also Read: Heatwave Alert: బీ కేర్ ఫుల్.. మూడు రోజులు ఎండలే ఎండలు!

Exit mobile version