Maanas : తండ్రి అయిన బిగ్ బాస్ కంటెస్టెంట్.. బాబు పుట్టాడు అంటూ..

మానస్ నిన్న తన భార్య శ్రీజ సీమంతం ఫోటో షేర్ చేసి తండ్రి కాబోతున్నాను అని ప్రకటించాడు.

Published By: HashtagU Telugu Desk
Serial Actor Bigg Boss Contestant Maanas Became Father Blessed with Baby Boy

Maanas

Maanas : పలు సీరియల్స్ తో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మానస్ బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొని ఫైనల్ వరకు వెళ్లి ఫైనల్ లో తిరిగొచ్చాడు. ప్రస్తుతం పలు సీరియల్స్, టీవీ షోలు, సిరీస్ లు, సినిమాలు చేస్తూ బిజీగానే ఉన్నాడు. గత సంవత్సరం నవంబర్ లో మానస్ విజయవాడకు చెందిన శ్రీజ అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

అయితే మానస్ నిన్న తన భార్య శ్రీజ సీమంతం ఫోటో షేర్ చేసి తండ్రి కాబోతున్నాను అని ప్రకటించాడు. తాజాగా నేడు ఉదయం తనకు అబ్బాయి పుట్టాడు అని తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తెలిపాడు. మానస్ – శ్రీజ జంట పండంటి బాబుకు జన్మనిచ్చి తల్లితందృలు అయ్యారు. దీంతో మానస్ అభిమానులు, నెటిజన్లు, పలువురు టీవీ ప్రముఖులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

Also Read : Alia Bhatt – NTR : అలియా భట్‌తో మరోసారి ఎన్టీఆర్.. ‘దేవర’తో ‘జిగ్రా’..

  Last Updated: 10 Sep 2024, 07:54 PM IST