Site icon HashtagU Telugu

September Special : ఈవారం ఓటీటీలో సందడి చేయనున్న మూవీస్ ఇవే

September Special upcoming Movies

September Special : సెప్టెంబరు నెలలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్‌లు మూవీ థియేటర్లు, ఓటీటీ వేదికల్లో సందడి చేయనున్నాయి. వాటిని చూసి ఎంజాయ్ చేసేందుకు సినీ ప్రియులు రెడీ అవుతున్నారు. ఈ వారంలో ఓటీటీలో అందరినీ అలరించబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లపై సమాచారంతో(September Special) కథనమిది.

We’re now on WhatsApp. Click to Join

  • ఈ వారంలో నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా సెప్టెంబరు 5న ది పర్‌ఫెక్ట్‌ కపుల్‌ (ఇంగ్లీష్‌), అపోలో 13: సర్వైవల్‌ (డాక్యుమెంటరీ) విడుదల అవుతాయి. సెప్టెంబరు 6న బ్యాడ్‌బాయ్స్‌: రైడ్ ఆర్‌ డై (ఇంగ్లీష్‌), రెబల్‌ రిడ్జ్ (ఇంగ్లీష్‌) రిలీజ్ అవుతాయి.
  • ఈవారంలో డిస్నీ+హాట్‌స్టార్‌ వేదికగా సెప్టెంబరు 4న బ్రిక్‌ టూన్స్‌ (ఇంగ్లీష్‌) విడుదల అవుతుంది. సెప్టెంబరు 6న కిల్‌ (హిందీ) రిలీజ్ ఉంది.
  • ఈ వారంలో సెప్టెంబరు 6న సోనీలివ్‌ వేదికగా తనావ్‌ 2 (హిందీ) రిలీజ్ ఉంది.
  • హీరో విజయ్‌ నటించిన ‘ది గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌’ మూవీ సెప్టెంబర్‌ 5న విడుదల అవుతుంది.
  • హీరో రానా నిర్మాతగా వ్యవహరించిన ’35 చిన్న కథ కాదు’ మూవీ తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సెప్టెంబర్‌ 6న విడుదల అవుతుంది.
  • హీరో సుహాస్‌ నటించిన ‘జనక అయితే గనక’ మూవీ సెప్టెంబరు 7న విడుదల అవుతుంది.

Also Read :Smita Sabharwal : ఐఏఎస్ స్మితా సబర్వాల్‎కు ఊరట.. పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

  • హీరో అశ్విన్ బాబు నటించిన శివం భజే సినిమా ఆగస్ట్ 30వ తేదీనే అమెజాన్ ప్రైమ్, ఆహాలో రిలీజ్ అయింది.
  • హనీమూన్ ఎక్స్‌ప్రెస్ మూవీ ఈ వారమే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో హనీమూన్ ఎక్స్‌ప్రెస్ డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది.
  • ఐసీ814: ది కాందహార్ హైజాక్ అనేది వెబ్ సిరీస్. తమన్నా లవర్ విజయ్ వర్మ ఇందులో నటించారు. ఈ వెబ్ సిరీస్ ఆగస్ట్ 29 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇది హిందీ, తెలుగు, తమిళం, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది.