Mega156: మెగాస్టార్ చిరంజీవి తన 156వ చిత్రంలో బి-టౌన్ క్వీన్ ఐశ్వర్యరాయ్ బచ్చన్‌తో రొమాన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇది సోషియో-ఫాంటసీగా రూపొందించబడింది. మాజీ ప్రపంచ సుందరి టాలీవుడ్‌లోకి రాబోతుంది. “చిరంజీవి, ఐశ్వర్య రాయ్ జంట ఒక సంచలనాత్మక కలయిక అవుతుంది. ఒకవేళ ఈ కాంబినేషనల్ సెట్ అయితే, ఈ చిత్రం భారతదేశం అంతటా భారీ హైప్ క్రియేట్ చేసేలా ఉంది. ఐశ్వర్య రాయ్‌తో చర్చలు జరుగుతున్నాయని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ టాక్.
ఐశ్వర్య ఇటీవల హిస్టారికల్ డ్రామా ‘పొన్నియిన్ సెల్వన్’ సిరీస్‌లో స్కీమింగ్ క్వీన్ నందినిగా తన కెరీర్‌లో ఉత్తమంగా నటించింది. కాగా పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఇటీవల ఐశ్వర్య గ్రే షేడ్స్ ఉన్న పాత్రను పోషించింది. పాత్రకు ప్రాణం పోసింది. ఆమె సొగసైన లుక్, నటన చిత్రానికి హైలైట్. అదేవిధంగా చిరు జోడీ కోసం మేకర్స్ సినిమాలో మానవునితో కనెక్ట్ అయ్యే ‘ఏంజెల్’ పాత్రకు సరిపోయే స్థాయి నటి కోసం అన్వేషిస్తున్నారు.
అయితే ఐశ్వర్య రాయ్ ఏకైక ఎంపిక అని తెలుస్తోంది. వశిష్ట దర్శకత్వం వహిస్తున్న సోషియో-ఫాంటసీ రూ. 200 కోట్లతో రూపొందుతోంది. ఇంతకుముందు, చిరంజీవి బ్లాక్‌బస్టర్ చిత్రం ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’లో ఇలాంటి పాత్రను పోషించారు. ఆ చిత్రంలో దివంగత శ్రీదేవి చిరంజీవితో రొమాన్స్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
Also Read: Rashmika Mandanna: రష్మిక మందన్నా మార్ఫింగ్ , నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వీడియో