Site icon HashtagU Telugu

NTR – Balakrishna : ఎన్టీఆర్, బాలయ్య కాంబినేషన్‌లో రావాల్సిన మల్టీస్టారర్.. కానీ..!

Senior Ntr Balakrishna miss another Multi starrer due to Balakrishna Study

Senior Ntr Balakrishna miss another Multi starrer due to Balakrishna Study

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు(Nandamuri Taraka Ramarao), నటసింహ బాలకృష్ణ(Balakrishna) కలిసి పలు సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే. బాలయ్య తన సినీ కెరీర్ ని ఎన్టీఆర్ చిత్రాల్లో నటించే స్టార్ట్ చేశాడు. అదికూడా ఎన్టీఆర్(NTR) సొంత నిర్మాణ సంస్థల్లో సినిమా అయితేనే బాలకృష్ణ నటించేవాడు. ఎందుకంటే బాలయ్య చదువుని దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ సొంత నిర్మాణ సంస్థలో సినిమాలు అయితే సిగ్నల్ ఇచ్చేవారు. సొంత ప్రొడక్షన్ లో అయితే బాలకృష్ణ చదువుకి ఎటువంటి ఇబ్బంది ఉండదని భావించేవారు. ఈక్రమంలోనే ఒక సూపర్ హిట్ మల్టీస్టారర్ చిత్రం మిస్ అయ్యింది.

ఎన్టీఆర్ హీరోగా 1977లో వచ్చిన సోషియో ఫాంటసీ మూవీ ‘యమగోల’(Yamagola) ఎంతటి హిట్ అయ్యిందో అందరికి తెలిసిన విషయమే. తెలుగు సినిమాల్లో  అది ఒక క్లాసిక్ గా నిలిచింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా నటించగా యముడిగా కైకాల సత్యనారాయణ నటించారు. అయితే ఈ మూవీలో మెయిన్ హీరోగా బాలయ్య, యముడిగా రామారావు నటించి ఉంటే.. అది ఎలా ఉండేదో ఒకసారి ఊహించుకోండి. ఎందుకంటే, ఎన్టీఆర్ గనుక ఒకే చెప్పి ఉంటే.. ఈ కాంబినేషన్ లోనే యమగోల ఆడియన్స్ ముందుకు వచ్చి ఉండాలి.

ఈ సినిమాకి డి.వి.నరసరాజు కథని అందించారు. ఈ మూవీ స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో నరసరాజుకి ఒక ఆలోచన వచ్చింది. 1977 లోనే ఎన్టీఆర్ ‘దాన వీర శూర కర్ణ’ మూవీలో బాలకృష్ణ అభిమన్యుడి పాత్రలో నటించి ఆడియన్స్ ని మెప్పించాడు. ఇక యమగోల స్క్రిప్ట్ రాస్తున్న సమయంలో నరసరాజుకి.. యమగోలలో బాలయ్యని కథానాయకుడిగా, ఎన్టీఆర్ ని యముడిగా చూపిస్తే బాగుంటుంది అనిపించిందట. దీంతో ఆ ఆలోచన దృష్టిలో పెట్టుకొనే ఆ సినిమా స్క్రిప్ట్ ని రాశారట.

ఇక ఈ విషయాన్ని ఆ మూవీ నిర్మాత ఎస్‌.వెంకటరత్నంకి తెలియజేసి.. రామారావుని అడగమని చెప్పారు. ఎన్టీఆర్ కి కథని వినిపించిన తరువాత అసలు విషయం చెప్పారు. కథకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ఎన్టీఆర్.. బాలయ్య హీరోగా మాత్రం ఒప్పుకోలేదు. దానికి కారణం బయట నిర్మాణ సంస్థ కావడం. బాలయ్య చదువుకి ఇబ్బంది అవుతుందని, లేదా బాలయ్య చదువు వల్ల నిర్మాతలు ఇబ్బంది పడడమో జరుగుతుందని ఎన్టీఆర్ నిరాకరించారు. ఒకవేళ అప్పుడు ఒకే చెప్పి ఉంటే.. నందమూరి అభిమానులకు మరో మంచి మల్టీస్టారర్ వచ్చేది.

 

Also Read : Prabhas Salaar : రెబల్ ఫ్యాన్స్ కు షాక్.. సలార్ 6 నెలలు వెనక్కి..!