ఇండస్ట్రీ (Industry ) అంటే ఎప్పుడూ మారుతున్న నీటి ప్రవాహం లాంటిది. కొత్త హీరోయిన్లు వస్తూ ఉంటారు, ఆకట్టుకుంటారు. కానీ కొంతమంది సీనియర్ భామలు మాత్రం ఈ పోటీకి తగ్గట్టే ఎదురుదాడి చేస్తూ తమ హవాను కొనసాగుతుంటారు. కొత్త తరం హీరోయిన్స్ గ్లామర్ షోతో, సోషల్ మీడియాలో హైప్‌తో జోరు చూపిస్తున్నా… టాలీవుడ్‌లో నయనతార, సమంత, కీర్తి సురేష్, తమన్నా లాంటి సీనియర్ హీరోయిన్లు తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు. ఈ పోటీ తట్టుకోవాలంటే కేవలం నటన కాదు, స్టైల్, గ్లామర్, సోషల్ మీడియా మీడియా ఇలా అన్నీ కీలకంగా మారాయి. సో వారు కూడా తమ గ్లామర్ షో ను రోజు రోజుకు పెంచుకుంటూ కొత్త భామలకు షాక్ ఇస్తున్నారు.
Trump: ట్రంప్ అల్టిమేటం.. జూలై 9 డెడ్‌లైన్‌తో అమెరికా వాణిజ్య ఒప్పందాలపై క్లారిటీ
నయనతార విషయానికొస్తే.. ఆమె సెలెక్టివ్ గా సినిమాలు చేస్తూ గ్లామర్ ను అలాగే కొనసాగిస్తోంది. కొత్త భామల గ్లామర్‌కి ఏ మాత్రం తగ్గకుండా తనదైన మార్క్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మళ్లీ అదే విధంగా సమంతా, సినిమాలు తక్కువ చేస్తూ కూడా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ బేస్‌ను కాపాడుకుంటోంది. ఆమె పోస్టులు, జిమ్ వీడియోలు, ఫిట్‌నెస్ కాన్సెప్ట్‌తో ఎప్పుడూ లైమ్‌లైట్‌లో ఉంటుంది. ఇదే ఆమెను పోటీ నుంచి వెనక్కి కాకుండా నిలబెట్టింది. ఇక కీర్తి సురేష్ కూడా ఇప్పుడిప్పుడే గ్లామర్ ఎలివేషన్ వైపు అడుగులు వేస్తూ యువతను ఆకర్షిస్తోంది.
Tungabhadra Dam : పరవళ్లు తొక్కుతున్న తుంగభద్ర.. డ్యామ్ 20 గేట్లు ఎత్తివేత
తమన్నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికీ మిల్కీ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకున్న ఆమె, డాన్స్, గ్లామర్ ప్రెజెన్స్ ద్వారా ఇప్పటికీ అవకాశాలు పొందుతోంది. ఈ నలుగురు సీనియర్ భామలు – కొత్త వారిని తట్టుకుని తమకున్న క్రేజ్‌ను నిలబెట్టుకోవడమే కాదు, మరింతగా పెంచుకుంటూ పోతున్నారు.