Simran: ఈ వయసులో కూడా మహేష్ సాంగ్ కు స్టెప్పులు ఇరగదీసిన సిమ్రాన్.. ఏం ఎనర్జీరా బాబు అంటూ!

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది సిమ్రాన్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. తెలుగు,తమిళ, హిందీ, మలయాళం సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 1999 నుంచి 2004 వరకు స్టార్ […]

Published By: HashtagU Telugu Desk
Mixcollage 12 Mar 2024 02 38 Pm 6821

Mixcollage 12 Mar 2024 02 38 Pm 6821

ఒకప్పటి స్టార్ హీరోయిన్ సిమ్రాన్ గురించి మనందరికీ తెలిసిందే. ఈ తరం ప్రేక్షకులకు అంతగా తెలియక పోయినప్పటికీ ఆ తరం ప్రేక్షకులు ఈమెను ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది సిమ్రాన్. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మెప్పించింది. సన్నజాజి నడుముతో అప్పటి యువతను కట్టిపడేశారు సిమ్రాన్. తెలుగు,తమిళ, హిందీ, మలయాళం సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించింది సిమ్రాన్. 1999 నుంచి 2004 వరకు స్టార్ హీరోయిన్ గా రాణించింది.

కాగా సిమ్రాన్ అసలు పేరు రిషిబాల నావల్ సినిమాల్లోకి వచ్చిన తర్వాత సిమ్రాన్ గా పేరు మార్చుకుంది. తెలుగులో చాలా మంది స్టార్ హీరోల సరసన సినిమాలు చేసి మెప్పించారు సిమ్రాన్. సీనియర్ హీరోలే కాదు మహేష్ బాబుతో కూడా నటించారు సిమ్రాన్. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టి సినిమాలు చేస్తున్నారు సిమ్రాన్. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో సిమ్రాన్ అంతగా స్పీడ్ చూపించడం లేదు. అడపాదడపా సినిమాలు చేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో మాత్రం సిమ్రాన్ చాలా యాక్టివ్ గా ఉంటారు. రకరకాల పోస్ట్ లు షేర్ చేస్తూ అభిమానులతో టచ్ లో ఉన్నారు. అప్పుడప్పుడు ఈమె సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.

 

కాగా సిమ్రాన్ వయసు ప్రస్తుతం 47 ఏళ్ళు. అయినా కూడా కూడా ఏ మాత్రం తగ్గకుండా అదే ఎనర్జీతో డాన్సులు చేస్తూ అందాలను ఆరబోస్తూ ఉంటుంది. అదిరిపోయే డాన్స్ లతో ఆకట్టుకుంటున్నారు సిమ్రాన్. తాజాగా మహేష్ బాబు మాస్ సాంగ్ కు స్టెప్పులేసి అలరించింది. మహేష్ బాబు హీరోగా నటించిన గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతబెట్టి సాంగ్ ఎంత ఫెమస్ అయ్యిందో అందరికి తెలుసు. ఈ సాంగ్ కు చాలా మంది ఫాన్స్ ఉన్నారు. ఇప్పటికే చాలా మంది ఈ సాంగ్ కు స్టెప్పులేసి అలరించారు. సెలబ్రెటీలు కూడా ఈ పాటకు స్టెప్పులేశారు. తాజాగా సిమ్రాన్ కూడా ఈ పాటకు డాన్స్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో సిమ్రాన్ ఎనర్జిక్ సెల్యూట్ చెయ్యాల్సిందే. ఈ వయసులోనూ ఆ రేంజ్ లో డాన్స్ చేశారంటే నిజంగా గ్రేట్ అనే చెప్పాలి. ఆ వీడియో వైరల్ అవ్వడంతో ఓల్డ్ ఈజ్ ఆల్వేస్ గోల్డ్ సిమ్రాన్ గారు మీరు సూపర్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు అభిమానులు.

  Last Updated: 12 Mar 2024, 02:39 PM IST