Mahesh Babu : మహేష్ బాబు వల్ల నా అహం దెబ్బతింది.. సీనియర్ యాక్టర్ రంగనాథ్..

మహేష్ బాబు వల్ల నా అహం దెబ్బతింది అంటూ సీనియర్ యాక్టర్ రంగనాథ్ చెప్పుకొచ్చారు. నిజం సినిమాలో నటిస్తున్నప్పుడు..

Published By: HashtagU Telugu Desk
Senior Actor Ranganath Viral Comments About Mahesh Babu

Senior Actor Ranganath Viral Comments About Mahesh Babu

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రతి ఒక్కరితో చాలా సరదాగా ఉంటారు. మహేష్ కెరీర్ స్టార్టింగ్ నుంచి ఆయనతో పని చేసిన ప్రతి ఒక్కరు.. మహేష్ తో వర్క్ ఎక్స్‌పిరెన్స్ గురించి చాలా గొప్పగా చెబుతారు. కానీ ఒక సీనియర్ నటుడు మాత్రం మహేష్ వల్ల తన అహం దెబ్బతింది అంటూ చెప్పుకొస్తున్నారు. ఆ నటుడు మరెవరో కాదు.. ‘నిజం’ సినిమాలో మహేష్ కి తండ్రి పాత్రలో నటించిన ‘రంగనాథ్’.

తేజ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా జైలు సీన్ లో రంగనాథ్ అండ్ మహేష్ బాబు మధ్య వచ్చే సీన్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఆ సీన్ లో మహేష్ బాబు డైలాగ్స్ చెప్పాల్సి ఉంటుంది. ఆ సీన్ లో నటించడం కూడా చాలా కష్టమంట. అలాంటి సీన్ ని మహేష్ బాబు ఎలా చేస్తాడు..? సరిగ్గా చేస్తాడా, లేదా..? అసలు అతను చేయగలడా..? అనే ఒక చిన్న చూపుతో, అహంతో రంగనాథ్ ఫీల్ అయ్యారట.

కానీ ఆ సీన్ మహేష్ బాబు చేసిన తరువాత.. తాను మంచి నటుడు అనే రంగనాథ్ అహం దెబ్బతిన్నదట. తన లైఫ్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ టైం, ఒకరు తన అహాన్ని దెబ్బతీశారని రంగనాథ్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఆ సీన్ ని మహేష్ బాబు అంత గొప్పగా చేశారట. అప్పటివరకు మహేష్ ని ఒక చిన్న చూపు చూసిన రంగనాథ్.. ఆ తరువాత నుంచి ఒక సత్తా ఉన్న నటుడిగా చూడడం మొదలు పెట్టారట.

ఇక నిజం సినిమా విషయానికి వస్తే.. రంగనాథ్ చెప్పినట్లు ఈ సినిమాలో మహేష్ యాక్టింగ్ ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ సినిమా మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ గా నిలిచింది. ‘ఒక్కడు’ వంటి మాస్ బ్లాక్ బస్టర్ తరువాత ఈ సినిమా రావడం.. నిజం చిత్రానికి బాగా మైనస్ అయ్యింది.

Also read : Double Ismart : హమ్మయ్యా డబుల్ ఇస్మార్ట్ షూటింగ్ మొదలైందిలే.. ఈసారైనా కంప్లీట్ అవుతుందా..?

  Last Updated: 04 May 2024, 04:51 PM IST