Site icon HashtagU Telugu

Movies – IPL : ఒక దర్శకుడు ఐపీఎల్ పై అసహనం.. మరో ఇద్దరు డైరెక్టర్స్ ఐపీఎల్‌తోనే ప్రమోషన్స్..

Sekhar Kammula Nag Ashwin Using Ipl For Movie Promotions But Anil Ravipudi Viral Comments On It

Sekhar Kammula Nag Ashwin Using Ipl For Movie Promotions But Anil Ravipudi Viral Comments On It

Movies – IPL : సినిమా పరిశ్రమకు వేసవి కాలం అనేది ప్రైమ్ టైం లాంటిది. ఆ సమయంలో స్కూల్స్ అండ్ కాలేజీలకు హాలిడేస్ ఉండడంతో.. ఆ టైములో సినిమాలు తీసుకు వస్తే భారీ కలెక్షన్స్ వస్తాయని భావిస్తారు. కానీ ఐపీఎల్ వల్ల సినిమాల మార్కెట్ కి కొంచెం ఇబ్బంది కలుగుతుంది. పెద్ద సినిమాలకు ఐపీఎల్ వల్ల పెద్ద ప్రాబ్లెమ్ ఉండదు. కానీ మీడియం సినిమాలకే ఐపీఎల్ ఒక తలనొప్పిగా మారుతుంది. ఐపీఎల్ వల్ల చిన్న సినిమాలను చూసేందుకు ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు.

దీంతో మీడియం సినిమాలు టాక్ బాగున్నా కమర్షియల్ గా బెనిఫిట్ కాలేకపోతున్నాయి. ఇక ఈ విషయం పై టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రియాక్ట్ అవుతూ అసహనం వ్యక్తం చేసారు. సత్యదేవ్ నటించిన ‘కృష్ణమ్మ’ సినిమా ఈవెంట్ పాల్గొన్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. “కృష్ణమ్మ సినిమా రిలీజ్ కాబోతుంది. ఐపీఎల్ మ్యాచ్స్ చూడకపోతే కొంపలు ఏం మునిగిపోవు. ఐపీఎల్ మ్యాచ్స్ ని ఫోన్స్ లో కూడా చూడొచ్చు. కాబట్టి ఈవెనింగ్ టైమ్స్ లో సినిమాలకు వచ్చి ఫస్ట్ షో, సెకండ్ షోలో సినిమాలు చూసి ఎంజాయ్ చేయండి” అంటూ చెప్పుకొచ్చారు.

ఈ దర్శకుడు ఇలా కామెంట్స్ చేస్తే.. మరో ఇద్దరు దర్శకులు మాత్రం ఐపీఎల్ తోనే ప్రమోషన్స్ నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రభాస్ తో ‘కల్కి’ సినిమా తెరకెక్కిస్తున్న నాగ్ అశ్విన్.. ఆ మూవీ ప్రమోషన్స్ ని కంప్లీట్ గా ఐపీఎల్ ద్వారానే నిర్వహిస్తూ వస్తున్నారు. ఇక నాగ్ అశ్విన్ చేస్తున్న ప్రమోషన్స్ ని చూసిన శేఖర్ కమ్ముల కూడా తాను డైరెక్ట్ చేస్తున్న ‘కుబేర’ ప్రమోషన్స్ ని కూడా ఐపీఎల్ ద్వారానే ప్లాన్ చేస్తున్నారు.

ఈక్రమ్మలోనే సినిమాలో ముఖ్య పాత్ర చేస్తున్న నాగార్జున ఫస్ట్ లుక్ ని ఐపీఎల్ మ్యాచ్ తో పాటు రిలీజ్ చేయబోతున్నారు. ధనుష్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఐపీఎల్ పూర్తి అయ్యేవారు ఈ ఇద్దరు దర్శకులు తమ సినిమా ప్రమోషన్స్ ని ఇలానే చేయబోతున్నారు. మరి వీరి దారిలో మిగిలిన డైరెక్టర్స్ కూడా అడుగులు వేస్తారేమో చూడాలి.