Site icon HashtagU Telugu

SVSC: సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీరిలీజ్.. స్పెషల్ డిమాండ్ చేస్తున్న ఫ్యాన్స్?

Svsc

Svsc

మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ అన్నదమ్ములుగా కలిసి నటించిన చిత్రం సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఇందులో అంజలి సమంత హీరోయిన్లుగా నటించిన విషయం తెలిసిందే. 2013లో విడుదల అయిన ఈ సినిమా దిల్ రాజు శ్రీకాంత్ అడ్డాల కెరియర్ లో ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయింది. ఈ సినిమా విడుదల అయ్యి దశాబ్ద కాలం దాటిపోయిన కూడా టీవీలలో యూట్యూబ్లలో, ఓటీటీలో ఎక్కడ కనిపించినా కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చాలా ఇష్టంగా చూస్తూ ఉంటారు. ఫ్యామిలీతో చూడదగ్గ సినిమా కావడంతో ఫ్యామిలీ ప్రేక్షకులూ ఈ సినిమాను చాలా ఇష్టపడుతూ ఉంటారు.

ఇకపోతే ఈ సినిమాను ఇప్పుడు రీ రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నెల అనగా మార్చి 7న ఈ చిత్రం రీరిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు హడావిడి మాములుగా లేదని చెప్పాలి. వెంకీ అభిమానులు ఇటు మహేష్ అభిమానులు తెగ సందడి సందడి చేస్తున్నారు. అయితే అభిమానులు అలాగే ప్రేక్షకులు సంతోషించే సమయంలో ఇప్పుడు కొంతమంది నెటిజెన్స్ కొత్త డిమాండ్స్ మొదలుపెట్టారు. రీరిలీజ్ వేళ మహేష్ బాబు, వెంకటేష్ ఇద్దరికీ సెపరేట్ టైటిల్ కార్డ్స్ వేయాలంటూ అడుగుతున్నారు. వెంకటేష్‌కి అయితే ఇటీవల సంక్రాంతికి వస్తున్నాం చిత్రానికి స్పెషల్ టైటిల్ కార్డ్ పడింది.

ఇది ఫ్యాన్స్‌ ని బాగా ఆకట్టుకుంది. దీంతో ఈ టైటిల్ కార్డ్ SVSC రీరిలీజ్‌కి వేయాలని కోరుతున్నారు ఫ్యాన్స్. ఇక మహేష్ బాబుకి అయితే గుంటూరు కారం చిత్రానికి పడిన టైటిల్ కార్డ్ కావాలంటూ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇదే జరిగితే టైటిల్ కార్డ్స్‌కే థియేటర్ దద్దరిల్లిపోతుంది. ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి అభిమానుల కోరిక మేరకు మూవీ మేకర్స్ టైటిల్ కార్డ్స్ వేస్తారేమో చూడాలి మరి. అప్పట్లో ఈ సినిమా విడుదల అయ్యి మంచి కలెక్షన్లను సాధించింది. మరి ఇప్పుడు ఏ మేరకు కలెక్షన్లను కాపాడుతుందో చూడాలి మరి.