Devara : కొరటాల శివ దర్శకత్వంలో మ్యాన్ ఆఫ్ మాసస్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం ‘దేవర’. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్ తో కళ్యాణ్ రామ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రూపొందుతుంది. మొదటి భాగం సెప్టెంబర్ లో రిలీజ్ అయ్యేందుకు సిద్దమవుతుంది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటికే చిన్న గ్లింప్స్ ని, టైటిల్ ని సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సాంగ్ ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు.
అనిరుద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సముద్రం ఒడ్డున ఎన్టీఆర్ అండ్ జాన్వీ పై ఒక అందమైన రొమాంటిక్ సాంగ్ ని కొరటాల చిత్రీకరించారట. ఇప్పుడు ఆ పాటని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ వారంలో ఆ సాంగ్ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ ని ఇవ్వబోతున్నారట. ‘ఆల్ హెయిల్ టైగర్’ అంటూ మొదటి సాంగ్ తో అందర్నీ ఆకట్టుకున్న అనిరుద్.. సెకండ్ సాంగ్ తో ఎలా అలరించనున్నారో చూడాలి.
కాగా ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా కావడంతో పాన్ ఇండియా వైడ్ ఈ చిత్రం పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలకు తగ్గట్లు ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీఖాన్ నటిస్తుండడం, అలాగే సౌత్ ఇండస్ట్రీలోని ఇతర స్టార్ యాక్టర్స్ కూడా ఈ మూవీలో నటిస్తుండడంతో మూవీ పై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తుంది. సెప్టెంబర్ 27న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకి లాంగ్ వీకెండ్ తో పాటు దసరా సెలవలు కూడా కలిసి రాబోతున్నాయి. మరి కలెక్షన్స్ విషయంలో ఈ చిత్రం ఎలాంటి దూకుడు చూపిస్తుందో చూడాలి.