Site icon HashtagU Telugu

OTT: ‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్ సరికొత్త రికార్డ్.. ఏకంగా ఇండియా టాప్3 లిస్టులో!

Save The Tigers Season 2 Trailer Released

Save The Tigers Season 2 Trailer Released

OTT:  ఇండియాలోనే అన్ని ఓటీటీ మాధ్యమాల్లో వచ్చిన రీసెంట్ వెబ్ సిరీస్‌ల్లో టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ నిలవటంపై షో రన్నర్ మహి వి.రాఘవ్ తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ‘‘సేవ్ ది టైగర్స్ సిరీస్‌ను ఎక్కువగా చూసి పెద్ద విజయాన్ని అందించటం చాలా సంతోషంగా ఉంది. రెండు సీజన్స్ ఇంత పెద్ద విజయాన్ని సాధించటం సాధారణమైన విషయం కాదు. పెళ్లి, మానవ సంబంధాలను ఆధారంగా చేసుకుని చక్కటి కథలను ఆవిష్కరిస్తే అవి మంచి విజయాలను సాధిస్తాయని దీంతో రుజువైంది. కామెడీ వెబ్ షోలను ప్రేక్షకులు ఫ్యామిలీ చిత్రాలను భావిస్తారని నమ్మకం కుదిరింది’’ అని పేర్కొన్నారు.

ఇటీవల డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ ఇటు యూత్, అటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ అందరినీ మెప్పిస్తోన్న వెబ్ సిరీస్ ‘సేవ్ ది టైగర్స్’ సీజన్ 2. దక్షిణాదిలోనే కాదు.. ఇండియా మొత్తంలో ఈ సిరీస్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ షోగా నిలిచింది. ఈ విజయం ఎంత పెద్దదిగా నిలిచిందంటే ఇండియాలో ఏ ఓటీటీలో మాధ్యమంలోనైనా టాప్ 3 స్థానంలో సేవ్ ది టైగర్స్ షో సత్తా చాటింది.

సేవ్ ది టైగర్స్ సీజన్ 1, సీజన్ 2 షోలకు వచ్చిన రెస్పాన్స్‌తో మరిన్ని సీజన్స్‌కు అవకాశం ఉందని నిరూపితమైంది. అందులో భాగంగా సీజన్ 3కి సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమైయాయి. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి సేవ్ ది టైగర్స్ సీజన్ 3 సెట్స్ పైకి వెళుతుంది. ఇదే సందర్భంలో ఔత్సాహిక రచయితలు, ఫిల్మ్ మేకర్స్‌ వాకి స్క్రిప్ట్స్, ఆలోచనలను తమకు పంపాలని మహి వి.రాఘవ్ నిర్మాణ సంస్థ త్రీ ఆటమ్ లీవ్స్ సంస్థ కోరింది.