Maa Oori Polimera 2 : దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌కు.. మా ఊరి పొలిమేర 2..

సత్యం రాజేష్‌ పొలిమేర 2 సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. భారతీయ చలచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే..

Published By: HashtagU Telugu Desk
Satyam Rajesh Maa Oori Polimera 2 Selected To 14th Dada Saheb Phalke Film Festival

Satyam Rajesh Maa Oori Polimera 2 Selected To 14th Dada Saheb Phalke Film Festival

Maa Oori Polimera 2 : సత్యం రాజేష్‌ ప్రధాన పాత్రలో 2021లో ఆడియన్స్ ముందుకు వచ్చిన మిస్టిక్ థ్రిల్లర్ మూవీ ‘మా ఊరి పొలిమేర’. డా.అనిల్ విశ్వ‌నాథ్ ద‌ర్శ‌క‌త్వం వచ్చిన ఈ చిత్రం.. చేతబడుల కాన్సెప్ట్ తో రుపొందుంది. ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజయ్యి విశేషమైన ప్రేక్షకాదరణ అందుకుంది. కాగా ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో సీక్వెల్ కి లీడ్ ఇస్తూ ఇచ్చి ట్విస్ట్.. ఈ ఫ్రాంచైజ్ పై తెలుగు ఆడియన్స్ కి మంచి ఆసక్తిని కలుగజేసింది.

ఇక ఈ క్యూరియాసిటీ మధ్య వచ్చిన పొలిమేర 2 బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. గత ఏడాది రిలీజైన చిన్న సినిమాల్లో భారీ విజయాన్ని అందుకున్న టాప్ 5 మూవీస్ లో పొలిమేర 2 కూడా ఒకటి. కేవలం కలెక్షన్స్ మాత్రమే కాదు.. ఎన్నో ప్రశంసలు, అభినందనలు కూడా ఈ సినిమా అందుకుంది. తాజాగా ఈ చిత్రం అరుదైన గౌరవాన్ని అందుకుంది.

భారతీయ చలచిత్ర పరిశ్రమలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ‘దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్’లో ఈ సినిమా చోటు దక్కించుకుంది. రేపు (ఏప్రిల్ 30) దేశరాజధాని ఢిల్లీలో జరగబోయే 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో పొలిమేర 2 అధికారికంగా ఎంపిక అయ్యింది. ఇలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్ కి తమ సినిమా ఎంపిక అవ్వడం పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తుంది. ఇక తెలుగు ఆడియన్స్ సోషల్ మీడియా ద్వారా చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు.

శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌర్ కృష్ణ నిర్మించిన ఈ చిత్రంలో బాలాదిత్య, గెటప్ శ్రీను, చిత్రం శీను, సాహితీ దాసరి కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ మూడో బాగా కూడా ఉండనుంది. సెకండ్ పార్ట్ ఎండింగ్ లో మూడో భాగానికి లీడ్ ఇస్తూ.. మరో సరికొత్త ట్విస్ట్ ని ఇచ్చారు. దీంతో మూడో పార్ట్ పై ఆడియన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు.

  Last Updated: 29 Apr 2024, 02:05 PM IST