Site icon HashtagU Telugu

Viral : అల్లు అర్జున్ పై సెటైరికల్ సాంగ్

Satirical Song On Allu Arju

Satirical Song On Allu Arju

గత కొద్దీ రోజులుగా అల్లు అర్జున్ (Allu Arjun) పేరు మారుమోగిపోతున్న సంగతి తెలిసిందే. ఆయన నటించిన పుష్ప 2 (Pushpa 2)మూవీ భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయినప్పటికీ ఆ ఎంజాయ్ ని తనివితీరా బన్నీ చేసుకోలేకపోతున్నాడు. దీనికి కారణం అందరికి తెలిసిందే. సంధ్య థియేటర్ (Sandhya Theater) ప్రీమియర్ షో కు బన్నీ హాజరు కావడం..అక్కడ తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెందడం, అల్లు అర్జున్ రియాక్షన్, ప్రభుత్వం యాక్షన్, జైల్లో వేయడం.. హైకోర్టు బెయిల్ ఇవ్వడం ఇవన్నీ తెలిసిందే. ప్రస్తుతం ఈ వ్యవహారం అంత మరచిపోతున్న సమయంలో ఇప్పుడు ఓ సాంగ్ బయటకు వచ్చి మరోసారి అల్లు అర్జున్ పేరు వార్తల్లో నిలిచేలా చేస్తుంది.

అల్లు అర్జున్ మీద ఓ సెటైరికల్ సాంగ్‌ను (Satire Song on Allu Arjun) ఎవరో కావాలనే దగ్గరుండి చేయించినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది. టికెట్లు మేమే కొనాలి.. చప్పట్లు మేమే కొట్టాలి.. సంపాదన మీకు రావాలి.. ప్రాణాలు మావి పోవాలా? అంటూ సెటైరికల్‌గా లిరిక్స్ రాశారు. ఈ పాటలో బన్నీ మ్యానరిజం, పుష్ప రాజ్ స్టైల్‌ను ఫాలో అయ్యారు. ఆడియెన్స్ అంటే ప్రేమ ఉన్నట్టు.. ఫ్యాన్స్ అంటే ప్రాణం అన్నట్టుగా బిల్డప్ ఇస్తారట.. లోలోపల మాత్రం తిట్టుకుంటారట.. బౌన్సర్లను పెట్టి ఆడియెన్స్‌ మీద బలుపు చూపిస్తారట. ఇలా ఆ పాట ఆద్యంతం బన్నీ మీద, హీరోల మీద, ఇండస్ట్రీ మీద సెటైర్ వేసినట్టుగానే ఉంది. ప్రస్తుతం ఈ ఫోక్ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఈ సాంగ్ పై లుక్ వెయ్యండి.

Read Also : Raghurama New Year Gift : సీఎం చంద్రబాబుకు రఘురామ న్యూ ఇయర్ గిఫ్ట్