Baahubali : ‘కట్టప్ప’ సత్యరాజ్ తల్లి కన్నుమూత..

సత్యరాజ్ మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు

Published By: HashtagU Telugu Desk
sathyaraj mother passes away

sathyaraj mother passes away

బాహుబలి ఫేమ్ సత్యరాజ్ ఇంట విషాదం నెలకొంది. సత్యరాజ్ తల్లి నతంబాల్ (Nathambal ) (94) వృద్దాప్య సమస్యలతో కన్నుమూశారు. కోయంబత్తూర్ లోని తన ఇంట్లో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన తల్లి మరణ వార్త విన్న వెంటనే హైదరాబాదులో షూటింగ్ లో ఉన్న సత్యరాజ్ వెంటనే కోయంబత్తూర్ కి చేరుకున్నారు. నతంబాల్ కి ముగ్గురు పిల్లలు.. అందులో సత్య రాజ్ ఒకరు కాగా మిగతా ఇద్దరు అమ్మాయిలు. వారి పేర్లు కల్పన, రూప.

సత్య రాజు (Sathyaraj)కు తన తల్లి అంటే ఎంతో ప్రేమ. ఈ విషయాన్ని పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. సత్యరాజ్ తల్లి మృతి పై పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సోషల్ మీడియా వేదికగా సంతాపం ప్రకటించారు. కాగా సత్యరాజ్ మూడు దశాబ్దాలకు పైగా చిత్ర పరిశ్రమలో రాణిస్తున్నారు. కెరీర్ మొదట్లో హీరోగా కూడా పలు సినిమాలు చేసి మెప్పించారు. ప్రస్తుతం స్టార్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు, తమిళ భాషల్లో రాణిస్తున్నారు.

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి (Baahubali) సిరీస్ ఆయనకు మరింత పాపులారిటీ తెచ్చిపెట్టింది. సత్యరాజ్ చేసిన కట్టప్ప పాత్ర ఇండియా వైడ్ ప్రాచుర్యం పొందింది. మిర్చి, ప్రతిరోజూ పండగే, జెర్సీ వంటి చిత్రాల్లో సత్యరాజ్ అద్భుతమైన పాత్రలు చేశారు.

Read Also : Delhi Game in AP : BJPచ‌ద‌రంగంలో ప‌వ‌న్! పొత్తుపై ఫోక‌స్!

  Last Updated: 12 Aug 2023, 02:30 PM IST