Site icon HashtagU Telugu

Mana Shankara Vara Prasad Garu : శశిరేఖ, ప్రసాద్ లవ్ సాంగ్ ప్రోమో అదిరిపోయిందిగా !!

Shashirekha Promo

Shashirekha Promo

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కలయికలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. వరుస సూపర్ హిట్లు కొడుతూ వస్తున్న అనిల్ ఈ మూవీ కి డైరెక్ట్ చేయడం తో ఈ సినిమా పై అంచనాలు పెరిగిపోయాయి. ఈ క్రమంలో ఈ సినిమాలోని ‘శశిరేఖ’ ప్రోమో సాంగ్ ను చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఈ లవ్ సాంగ్ ప్రోమోలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార సరికొత్త లుక్‌లో కనిపించి ఆకట్టుకున్నారు. చిరు ‘శశిరేఖ’ అని ముద్దుగా పిలవగా, నయన్ ‘ఓ ప్రసాదూ’ అని అంతే ప్రేమగా రిప్లై ఇవ్వడం ఆకట్టుకుంది. “శశిరేఖా… ఓ మాట చెప్పాలి. చెప్పాక ఫీలు కాక… ఓ ప్రసాదూ మోమాటాల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ….” అంటూ సాగే లిరిక్స్, భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతంపై అంచనాలను మరింత పెంచాయి. బోట్లపై శశిరేఖ, ప్రసాద్‌ల రొమాంటిక్ కెమిస్ట్రీ ఈ పాటలో హైలైట్‌గా నిలవగా, ఇందులో చిరంజీవి లవర్ బాయ్‌గా కనిపించి ఫ్యాన్స్‌ను ఆనందింపజేశారు. ఈ పూర్తి పాట ఈ నెల 8న విడుదల కానుంది.

Kidneys Care : ఆల్కహాల్ కాదు.. కిడ్నీలను డ్యామేజ్ చేసే మరో డేంజర్ డ్రింక్!

ఈ చిత్రం నుండి ఇప్పటికే విడుదలైన ‘మీసాల పిల్ల’ సాంగ్ అద్భుతమైన ట్రెండ్‌ను సృష్టిస్తూ, యూట్యూబ్‌లో మిలియన్ల కొద్దీ వ్యూస్‌తో దూసుకుపోతోంది. భార్యాభర్తల మధ్య జరిగే అలకలు, వాటిని ప్రసాద్ గారు కూల్ చేసే విధానాన్ని ఈ పాటలో ఎంతో అందంగా చూపించారు. ఉదిత్ నారాయణ్, శ్వేతా మోహన్ ఆలపించిన ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకోవడంతో, సోషల్ మీడియాలో దీనిపై వేల సంఖ్యలో రీల్స్ చేస్తున్నారు. ఈ పాటతో మెగాస్టార్‌లో వింటేజ్ రొమాన్స్‌ను చూశామని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న ఈ విజయవంతమైన పాట కారణంగా, ‘శశిరేఖ’ లవ్ సాంగ్‌పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. తాజాగా విడుదలైన ప్రోమోతో ఆ అంచనాలు మరింత పదింతలు అయ్యాయి, ఫుల్ సాంగ్ కోసం అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

ఇక ఈ మూవీ సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడికి సంక్రాంతి పండుగ బాగా కలిసొచ్చే అంశం. గతేడాది ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ తాజా చిత్రంలో చిరంజీవి, నయనతారలతో పాటు విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తుండగా, కేథరీన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ వంటి నటీనటులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Exit mobile version