Site icon HashtagU Telugu

Sasirekha Full Song : ‘మన శంకరవరప్రసాద్ ‘ లో లవ్ యాంగిల్ బాగానే ఉందిగా !!

Sasirekha Full Song : ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతార సరికొత్త లుక్స్‌లో కనిపించి తమ కూల్ స్టెప్స్‌తో అదరగొట్టారు

Sasirekha Full Song

Sasirekha Full Song

మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో భారీ అంచనాలతో రూపొందుతున్న చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ఈ సినిమా నుంచి తాజాగా విడుదలైన లవ్ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ప్రోమోతోనే భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ పాట, ఫుల్ సాంగ్ విడుదలయ్యాక ఆ అంచనాలను పదింతలు చేసింది. ఈ పాటలో మెగాస్టార్ చిరంజీవి మరియు నయనతార సరికొత్త లుక్స్‌లో కనిపించి తమ కూల్ స్టెప్స్‌తో అదరగొట్టారు. చిరు, నయన్ జోడీ మధ్య కెమిస్ట్రీ ఈ పాటకు మరింత హైలైట్‌గా నిలిచింది. ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ‘వేరే లెవెల్’ అంటూ సంగీత ప్రియుల నుంచి ప్రశంసలు అందుకుంటోంది.

Indigo Flights Cancellation: శంషాబాద్ ఎయిర్‌పోర్టులో 115 విమాన సర్వీసులు రద్దు

‘మన శంకరవరప్రసాద్ గారు’ చిత్రంలోని ఈ లవ్ సాంగ్ లిరిక్స్ ఎంతో ఆకట్టుకునేలా ఉన్నాయి. ‘శశిరేఖ ఓ మాట చెప్పాలి.. చెప్పాక ఫీలు కాకా.. ఓ ప్రసాదూ మోమాటల్లేకుండా చెప్పేసెయ్ ఏమి కాదూ…’ అంటూ సాగే ఈ సాహిత్యం మెగాస్టార్‌పై నాయికకున్న ప్రేమను, ఆయన వ్యక్తం చేయలేని భావాలను సూచిస్తుంది. ఈ పాటను అనంత్ శ్రీరామ్ రచించగా, భీమ్స్ సిసిరోలియో స్వయంగా మధుప్రియతో కలిసి ఆలపించారు. ఈ పాట సందర్భం విషయానికి వస్తే, చిరంజీవి పాత్ర ఓ సాధారణ వ్యక్తిగా ఉంటూ, ధనవంతురాలైన నయనతారను ప్రేమిస్తే, ఆ ప్రేమను వ్యక్తం చేసే సందర్భంలో ఈ పాట వస్తుందని తెలుస్తోంది. గతంలో విడుదలైన ఫస్ట్ సాంగ్ ‘మీసాల పిల్ల’ ట్రెండ్ అవుతున్న నేపథ్యంలో, ఈ తాజా లవ్ సాంగ్ కూడా యూత్‌ను, సంగీత ప్రియులను ఎంతగానో ఆకర్షిస్తోంది.

ఈ చిత్రంలో చిరంజీవి, నయనతార ప్రధాన పాత్రలు పోషిస్తుండగా, విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్ వంటి నటులు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ మరియు గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మిత కొణిదెల సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Exit mobile version