Site icon HashtagU Telugu

Hero Nani: సరిపోదా శనివారం నుంచి అప్డేట్..  నానిపై యాక్షన్ సన్నివేశాలు

Natural Star Nani

Natural Star Nani

Hero Nani: న్యాచురల్ స్టార్ నాని అనగానే విభిన్నమైన సినిమాలు కళ్ల ముందు కదలాడుతాయి. తాజాగా ఆయన మరోసారి డిఫరెంట్ సినిమాతో రాబోతున్నాడు. నాని,  ఫిల్మ్ మేకర్ వివేక్ ఆత్రేయ మళ్లీ సరిపోదా శనివారం అనే యాక్షన్ థ్రిల్లర్ కోసం జతకట్టిన విషయం తెలిసిందే. ఇటీవల, మేకర్స్ నాని పుట్టినరోజు సందర్భంగా సరికొత్త పోస్టర్ ను వదిలారు. ఇది అద్భుతమైన విజువల్స్‌తో ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం టీమ్ నానిపై ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తోంది.

అభిమానులకు షాక్ ఇస్తూ షూటింగ్ స్పాట్ నుండి నాని లుక్ రివీల్ చేయకుండా వర్కింగ్ స్టిల్ విడుదలైంది. ఈ చిత్రం ఆగస్టు 29, 2024న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ చిత్రంలో ప్రియాంక మోహన్ కథానాయిక. నానికి విలన్ గా ప్రముఖ నటుడు ఎస్‌జే సూర్య నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి స‌రిపోద‌ల శ‌నివారం చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూరుస్తున్నారు.