Sarathi Studios : సరికొత్త టెక్నాలజీతో పున:ప్రారంభమైన సారథి స్టూడియోస్‌

ఇప్పుడు సరికొత్త టెక్నలాజి తో మళ్లీ సారథి స్టూడియో ను నిర్మించి..ఈరోజు ప్రారంభించారు

  • Written By:
  • Publish Date - April 27, 2024 / 11:37 AM IST

సరికొత్త టెక్నాలజీతో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి (MM Keeravani) చేతుల మీదుగా సారథి స్టూడియో (Sarathi Studios) పున: ప్రారంభమైంది. సారథి స్టూడియోస్‌..ఇది తెలియని సినీ లవర్స్ లేరు..హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో 1956లో స్థాపించబడింది. హైదరాబాద్‌లో నిర్మించిన మొదటి ఫిల్మ్ స్టూడియో ఇదే కావడం విశేషం. ఈ స్టూడియోను చల్లపల్లి రాజు , యార్లగడ్డ శివరామ ప్రసాద్ నిర్మించారు. ఈ స్టూడియో లో మొదటిగా షూటింగ్ జరిగిన చిత్రం మా ఇంటి మహాలక్ష్మి (1959). ఆ తర్వాత ఎన్నో వేలాది చిత్రాలు , సీరియల్స్ ఇక్కడ షూటింగ్ జరుగుతూ వచ్చాయి. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియో, రామోజీ ఫిలిం సిటీ వంటివి అందుబాటులోకి రావడంతో సారథి స్టూడియోలో సినిమా షూటింగ్ లు తగ్గిపోయాయి.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఇప్పుడు సరికొత్త టెక్నలాజి తో మళ్లీ సారథి స్టూడియో ను నిర్మించి..ఈరోజు ప్రారంభించారు. ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టు సారథి స్టూడియోస్‌ను అధునాతన హంగులతో తీర్చిదిద్దారు. తెలుగు రాష్ట్రాల్లోనే
అధునాతన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్ స్టూడియోలను శ్రీ సారథీ స్టూడియోస్‌ను ఆస్కార్ అవార్డు విజేత కీరవాణి చేతుల మీదుగా పునః ప్రారంభమైంది. సౌండ్ డిజైన్ స్టూడియోను సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర ప్రారంభించారు.

ఈ సందర్భంగా శ్రీ సారథీ స్టూడియోస్ ఛైర్మన్ ఎం.ఎస్ ఆర్.వి. ప్రసాద్ (M.S.R.V. Prasad) మాట్లాడుతూ..’ఈ స్టూడియోని మల్టీఫ్లెక్స్ థియేటర్స్‌గా మార్చాలన్న ఆలోచన చేసి ఆ తర్వాత విరమించుకున్నాం. సినీ స్టూడియోస్‌గానే కొనసాగించాలని నిర్ణయించుకున్న అనంతరం షూటింగులకు కావలసిన అన్ని రకాల హంగులు, అలాగే నేటి కాలానికి పోటీపడేవిధంగా పోస్ట్ ప్రొడక్షన్స్ కు కావలసిన అధునాతన టెక్నాలజీని మా స్టూడియోలో అందుబాటులోకి తీసుకుని వచ్చాం. మేము ఆరంభించిన డాల్బీ మిక్సింగ్, సౌండ్ డిజైన్స్‌ చాలా అధునాతనమైనవి. ఈ టెక్నాలజీని ఉపయోగించుకుంటూ మా స్టూడియోలో మొదలైన మొదటి సినిమా యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ సినిమా “కల్కి” అని చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాం” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ నిర్మాతలు కేఎస్ రామారావు, కేఎల్ నారాయణ, రచయిత విజయేంద్రప్రసాద్, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్, సంగీత దర్శకుడు భీమ్స్, స్టూడియో జనరల్ మేనేజర్ బాలచంద్ర, పలువురు సినీ ప్రముఖులు పాల్గొని యాజమాన్యానికి అభినందనలు తెలియజేశారు.

Read Also : CBSE Board Exams: అల‌ర్ట్‌.. ఇక‌పై ఏడాదికి రెండు సార్లు సీబీఎస్‌ఈ పరీక్షలు