ప్రముఖ సీనియర్ నటుడు శరత్ బాబు(Sarath Babu) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్(Hyderabad) లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం చికిత్స తీసుకుంటూనే ఆయన కన్నుమూశారు. శరత్ బాబు మరణంతో టాలీవుడ్(Tollywood) లో ఒక్కసారిగా తీవ్ర విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.
శరత్ బాబు దాదాపు 300లకు పైగా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించాడు. స్టార్ హీరోలందరి సరసన నటించారు. హీరోగా కూడా ఎన్నో సూపర్ హిట్స్ కొట్టారు. మధ్యలో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్నా ఇటీవల మళ్ళీ కొన్ని సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేశారు. తెలుగులో చివరిసారిగా వకీల్ సాబ్ సినిమాలో కనిపించారు. అయితే ఆయన నటించిన చివరి సినిమా మాత్రం ఇంకా రిలీజ్ అవ్వలేదు.
శరత్ బాబు చివరిసారిగా మళ్ళీ పెళ్లి సినిమాలో నటించారు. MS రాజు దర్శకత్వంలో నరేష్, పవిత్ర జంటగా నటించిన మళ్ళీ పెళ్లి సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది. ఇది నరేష్ – పవిత్ర రియల్ స్టోరీలా ఉందని, ఇందులో ఈయన సూపర్ స్టార్ కృష్ణ రోల్ లో నటించినట్టు సమాచారం. ఆ సినిమా మరో నాలుగు రోజుల్లో రిలీజ్ ఉండగానే ఇలా మరణించడంతో చిత్రయూనిట్ విషాదంలో మునిగిపోయింది.
శరత్ బాబు మరణంపై నటుడు నరేష్ మాట్లాడుతూ.. శరత్ బాబు గొప్పనటుడు, అందగాడు. శరత్ బాబు నేను మంచి మిత్రులం. ఆయనతో కలిసి 12 సినిమాలు చేశాను. శరత్ బాబు ఒడ్డు పొడుగు చూసి అసూయపడేవాణ్ణి. మళ్లీ పెళ్లి చిత్రంలో జయసుధకు జోడిగా నటించమని అడిగితే ఒప్పుకున్నారు. ఆ షూటింగ్ సమయంలో కుడా ఆరోగ్యంగా ఉన్నారు. పవిత్రను, నన్ను దీవించి వెళ్లారు. మనస్సు విప్పి మాట్లాడుకునే మంచి మిత్రుణ్ణి కోల్పోయా. మా బ్యానర్ లో చివరి సినిమా చేశారనే ఆనంద పడాలో, బాధపడాలో అర్థం కావడం లేదు అని అన్నారు.
Also Read : Sarath Babu: టాలీవుడ్ లో విషాదం.. సినీ నటుడు శరత్ బాబు మృతి!