ప్రముఖ సీనియర్ సినీ నటుడు శరత్ బాబు(Sarath Babu) కొన్ని రోజుల క్రితం అస్వస్థతకు గురవ్వడంతో చెన్నై(Chennai)లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్(Hyderabad) లోని AIG హాస్పిటల్ కు తరలించారు. హైదరాబాద్ AIG హాస్పిటల్ లో గత కొన్ని రోజులుగా శరత్ బాబుకి చికిత్స అందిస్తున్నారు. ఆయన కిడ్నీ, లివర్, శరీరంలోని పలు ముఖ్య భాగాలు దెబ్బతిన్నాయని ICU లో ఉంచి చికిత్స అందిస్తున్నట్టు వైద్యులు తెలిపారు.
అయితే సడెన్ గా నిన్న సాయంత్రం శరత్ బాబు మరణించారని ఫేక్ వార్తలు సోషల్ మీడియాలో వచ్చాయి. దీనిపై శరత్ బాబు సోదరి మీడియాకు సమాధానమిస్తూ.. ఆయనకు ఇంకా చికిత్స కొనసాగుతోంది. ఆయన మరణించలేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. దయచేసి అలాంటి వార్తలని ప్రచారం చేయకండి అని తెలిపారు.
ఈ సంఘటన జరగడంతో నేడు సాయంత్రం శరత్ బాబు ఆరోగ్యంపై హెల్త్ బులిటెన్ ను విడుదల చేసింది ఏఐజీ ఆసుపత్రి. దీంట్లో.. శరత్ బాబు అనారోగ్యంపై అభిమానులు ఎలాంటి వదంతులు నమ్మొద్దు. శరత్ బాబు కుటుంబం లేదా ఏఐజీ ఆసుపత్రి ప్రతినిధి అధికారికంగా ఇచ్చే విషయాలనే నమ్మండి. శరత్ బాబు ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేస్తాం. ప్రస్తుతం శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి క్లిష్టంగానే ఉంది. కానీ ICU లో ఉంచి చికిత్స అందిస్తున్నాం అని తెలిపారు.
Also Read : Samantha@1: బాలీవుడ్ స్టార్స్ కు సమంత షాక్.. ఇండియన్ సెలబ్రిటీలో నెంబర్1