Sara and Deverakonda: టాలీవుడ్ యంగ్ హీరోతో డేటింగ్ చేయడం కోసం ఎదురుచూస్తున్న బాలీవుడ్ బ్యూటీ..?

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సీనియర్ నటి అమృత సింగ్ ల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి మనందరికీ

Published By: HashtagU Telugu Desk
Sara Ali Khan

Sara Ali Khan

బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్, సీనియర్ నటి అమృత సింగ్ ల కుమార్తె సారా అలీ ఖాన్ గురించి మనందరికీ తెలిసిందే. మొదట కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. సైఫ్ అలీ ఖాన్, అమృత సింగ్ ల కుమార్తెగా ఎంట్రీ ఇచ్చిన సరే అనీకాంత్ తన కంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలో ఎన్నో ఏర్పరచుకుంది. మొదటి సినిమాతోనే తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఫాలో ఇన్ని ఏర్పరచుకోవడమే కాకుండా, తొలి సినిమాకు గాను ఫిలింఫేర్ అవార్డును కూడా సొంతం చేసుకుంది.

అలాగే అత్రాంగిరే సినిమాలో అక్షయ్ కుమార్ ధనుష్ లతో కలిసి నటించి మెప్పించిన విషయం తెలిసింది. కాగా సారా అలీ ఖాన్ కు సోషల్ మీడియాలో విపరీతమైన ఫాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఈ ముద్దుగుమ్మ కెరియర్ పరంగా ఎంత బిజీబిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్లతో కుర్ర కారకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఇక అప్పుడప్పుడు మితిమీరిన హాట్ ఫోటో షూట్ చేసి ట్రోలింగ్స్ ని ఎదుర్కొంటూ ఉంటుంది.

కాగా ఇది ఇలా ఉంటే తాజాగా తనకు ఎవరితో డేటింగ్ చేయాలి ఉందొ ఆ విషయాన్ని మనసు విప్పి చెప్పేసింది. బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న కాఫీ విత్ కరణ్ 7 షోలో బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ అలాగే సారా అలీ ఖాన్ పాల్గొన్నారు. ఈ క్రమంలోనే హోస్ట్ కరణ్ జోహార్ సారా అలీ ఖాన్ ప్రశ్నిస్తూ ఎవరితో డేటింగ్ చేసేందుకు ఆసక్తి ఉంది అని ప్రశ్నించగా మొదట నా మనసు మార్చుకుని టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తో చేయాలని ఉంది అంటూ తన మనసులో మాటను బయట పెట్టేసింది. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కేవలం టాలీవుడ్ హీరోయిన్ లను మాత్రమే కాకుండా బాలీవుడ్ హీరోయిన్ల మనసును కూడా దోచుకుంటున్నాడు.

  Last Updated: 12 Jul 2022, 10:57 PM IST