Sapta Sagaralu Side B OTT Released : సైలెంట్ గా ఓటీటీలో సూపర్ హిట్ మూవీ.. సైడ్ బి ఫ్యాన్స్ సూపర్ హ్యాపీ..!

Sapta Sagaralu Side B OTT Released కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) అభిరుచి గల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. అయితే అతను చేస్తున్న సినిమాలు సౌత్ ఆడియన్స్

Published By: HashtagU Telugu Desk
Sapta Sagaralu Side B Ott Released Amazon Prime

Sapta Sagaralu Side B Ott Released Amazon Prime

Sapta Sagaralu Side B OTT Released కన్నడ హీరో రక్షిత్ శెట్టి (Rakshith Shetty) అభిరుచి గల సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. అయితే అతను చేస్తున్న సినిమాలు సౌత్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్నాయి. రక్షిత్ శెట్టి లేటెస్ట్ మూఈ సప్త సాగరాలు దాటి సక్సెస్ అయ్యింది. ప్రేమకథగా వచ్చిన ఈ సినిమా రెండు భాగాలుగా రిలీజ్ చేశారు. సప్త సాగరాలు దాటి సైడ్ A సెప్టెంబర్ లో రిలీజ్ కాగా సప్త సాగరాలు దాటి సైడ్ బి అక్టోబర్ లో రిలీజైంది.

We’re now on WhatsApp : Click to Join

రెండు భాగాలు తెలుగులో కూడా మంచి ఫలితాన్ని రాబట్టాయి. అయితే సప్త సాగరాలు దాటి సైడ్ A సినిమా ఓటీటీ రిలీజ్ లో అందుబాటులో ఉండగా సైడ్ B రిలీజై మూడు నెలలు అవుతున్నా ఇంకా ఓటీటీలో రిలీజ్ చేయలేదు. ఆ సినిమా కోసం ఓటీటీ ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూశారు. అయితే ఈమధ్య రక్షిత్ శెట్టి సైడ్ B ఓటీటీ రిలీజ్ త్వరలో ఉంటుందని మెసేజ్ చేశాడు.

అయితే సైలెంట్ గా సప్త సాగరాలు సైడ్ B జనవరి 25న అమేజాన్ ప్రైం లో రిలీజ్ చేశారు. సినిమా కోసం ఇన్నాళ్లు ఎంతో ఈగర్ గా ఎదురుచూసిన ఆడియన్స్ అంతా కూడా వావ్ అనేస్తున్నారు. సప్త సాగరాలు సినిమాలో రక్షిత్ శెట్టి తో పాటుగా రుఖ్మిణి వసంత్, నటించారు.

ఈ సినిమాతో హీరోయిన్ గా రుఖ్మిణి వసంత్ కి సూపర్ క్రేజ్ వచ్చింది. మరి ఓటీటీలో సైడ్ B ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. ఈ సినిమాను హేమంత్ ఎం రావు డైరెక్ట్ చేయగా రక్షిత్ శెట్టి సొంత నిర్మాణంలో తెరకెక్కించారు.

Also Read : Tillu Square Family Star : టిల్లు రిలీజ్ డేట్ లాక్.. వారం తర్వాత విజయ్.. అడ్జెస్ట్మెంట్ అయిపోయాయ్..!

  Last Updated: 26 Jan 2024, 12:30 PM IST