Rukhmini Vasanth : సప్త సాగరాలు దాటి.. సూపర్ ఛాన్స్ అందుకున్న బ్యూటీ..!

Rukhmini Vasanth కన్నడ నుంచి రీసెంట్ గా రిలీజైన సినిమా సప్త సాగరాలు దాటి సైడ్ A. హేమంత్ ఎం రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి రుక్మిణి వసంత్

Published By: HashtagU Telugu Desk
Sapta Sagaralu Dati Heroine Rukhmini Vasanth Tollywood Movie Chance

Sapta Sagaralu Dati Heroine Rukhmini Vasanth Tollywood Movie Chance

Rukhmini Vasanth కన్నడ నుంచి రీసెంట్ గా రిలీజైన సినిమా సప్త సాగరాలు దాటి సైడ్ A. హేమంత్ M రావు డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రక్షిత్ శెట్టి రుక్మిణి వసంత్ జంటగా నటించారు. సైడ్ A తో పాటుగా ఈ నెల 17న సైడ్ బి కూడా రిలీజ్ చేస్తున్నారు. ఒక లవ్ స్టోరీని రెండు భాగాలుగా చెప్పాలనే ఆలోచనే గొప్ప విషయమని చెప్పొచ్చు. సప్త సాగరాలు దాటి సైడ్ A ని తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇప్పుడు ఆ సినిమా సైడ్ B అదే సెకండ్ పార్ట్ వస్తుంది.

సప్త సాగరాలు దాటితో తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది రుక్మిణి వసంత్. అందుకే ఆమెకు తెలుగు నుంచి కూడా ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తుంది. ఎనర్జిటిక్స్ స్టార్ రామ్ నెక్స్ట్ సినిమలో రుక్మిణికి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. రామ్ ప్రస్తుతం పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో డబుల్ ఇస్మార్ట్ సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా తర్వాత పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారితో ఒక సినిమా ఉందని తెలుస్తుంది.

ఈ సినిమాలో రుక్మిణి వసంత్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకుంటున్నారట. ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరన్నది ఇంకా డిసైడ్ అవ్వలేదు. రామ్ (Ram) సినిమాతో తెలుగు తెరకు పరిచయమై చాలామంది భామలు ఇక్కడ స్టార్ క్రేజ్ తెచ్చుకున్నారు. మరి రామ్ తో రుక్మిణి జత కట్టడం ఆమె కెరీర్ కి ఎలా హెల్ప్ అవుతుందో చూడాలి. సప్త సాగరాలు దాటి సైడ్ A సినిమాలో ప్రియ పాత్రలో తన నటనతో మెప్పించింది రుక్మిణి. తెలుగు ఎంట్రీ ఇస్తే మాత్రం రుక్మిణికి కచ్చితంగా మంచి అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.

Also Read : Big B Remuneration: రజనీ కాంత్ మూవీ కోసం అమితాబ్ ఎన్ని కోట్లు తీసుకున్నాడో తెలుసా

We’re now on WhatsApp : Click to Join

  Last Updated: 10 Nov 2023, 12:57 PM IST