Sankranthiki Vasthunam : ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత విక్టరీ వెంకటేశ్ , అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరెక్కిన చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ (Sankranthiki Vasthunam). పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేశ్, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించింది. వెంకటేశ్, ఐశ్వర్య, మీనాక్షిల నటనతో పాటు బుల్లిరాజు కామెడీ ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కేవలం థియేటర్స్ లలోనే కాదు బుల్లితెర పై కూడా అదిరిపోయే TRP రేటింగ్ సాధించి వార్తల్లో నిలిచింది.
Ambati Rayudu : ఇప్పటికి రాయుడు ఆ సూట్‌కేస్‌ను ఓపెన్ చేయలేదు – అంబటి రాయుడి భార్య
ఇటీవలే ఈ మూవీ జీ ఛానల్ (Z Telugu) లో శాటిలైట్ ప్రీమియర్ జరుపుకున్న సంగత్ తెలిసిందే. తాజాగా వచ్చిన టిఆర్పి రేటింగ్స్ లో సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) ఏకంగా 15.92 సాధించి ఔరా అనిపించేసింది. HD ఛానల్ కు విడిగా వచ్చిన 2.3 కలుపుకుని సగటు తీసుకుంటే ఇది 18 దాటిపోతుంది. ఈ మధ్య కాలంలో ఇంత టిఆర్పి సాధించిన సినిమాలు ఏవి లేవు. ఆర్ఆర్ఆర్, కల్కి, హనుమాన్ లాంటి ప్యాన్ ఇండియా మూవీస్ సైతం ఇంత రాబట్టుకోలేదు. ఇదే జీ ఛానల్ గతంలో వచ్చిన శ్రీమంతుడు, వకీల్ సాబ్, డీజే, గీత గోవిందం లాంటివి టాప్ ప్లేస్ లో ఉండగా అప్పటి పరిస్థితులకు ఇప్పటికి చాలా మార్పులు వచ్చిన నేపథ్యంలో సంక్రాంతికి వస్తున్నాం ఫీట్ చాలా స్పెషల్ అని చెప్పుకోవచ్చు.