Site icon HashtagU Telugu

Godari Gattu : ‘సంక్రాంతికి వస్తున్నాం’ లిరికల్ వీడియో వచ్చేస్తుందోచ్

Godarigattusong

Godarigattusong

విక్టరీ వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి (Anil Ravipudi) తెరకెక్కిస్తోన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ ( Sankranthiki Vasthunam) సినిమా సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ‘ఎఫ్‌ 2’, ‘ఎఫ్‌ 3’ తర్వాత వెంకటేశ్‌ – దర్శకుడు అనిల్‌ రావిపూడి కాంబినేషన్‌లో రాబోతుండడం.. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్​పై దిల్‌ రాజు దీనిని నిర్మిస్తుండడంతో అంచనాలు రోజు కు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ కూడా విడుదలై సినీ ప్రియులను ఆకట్టుకుంది. అనిల్ రావిపూడి మార్క్‌ ఫన్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఇది సిద్ధమవుతోంది. మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. భగవంత్‌ కేసరి తర్వాత అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. ముక్కోణపు క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.

ఈ సినిమాలో వెంకటేశ్‌ మాజీ పోలీసు అధికారిగా కనిపించనున్నారు. రాజేంద్రప్రసాద్, సాయికుమార్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని ఫస్ట్ సింగిల్ ‘గోదారి గట్టు’ ( #GodariGattu ) లిరికల్ వీడియోను డిసెంబర్ 3న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. భాస్కరభట్ల రచించిన ఈ పాటను మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల (#Ramnagogula ), మధుప్రియ ఆలపించారు. భీమ్స్ సిసిరోలియో ( #BheemsCeciroleomusic) మ్యూజిక్ అందించారు. అనిల్‌ రావిపూడి గత చిత్రాల పాటలు కొన్ని మంచి స్పందన దక్కించుకున్నాయి. ఈ సినిమాలోని పాటలు సైతం తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్లుగా ఉంటాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. వెంకటేష్‌, ఐశ్వర్య రాజేష్‌లపై ఈ పాట ఉంటుందని పోస్టర్‌ను చూస్తే అర్థం అవుతుంది. ఈ పాటను టీ సిరీస్‌ మ్యూజిక్ ద్వారా విడుదల చేయబోతున్నారు.

అదికాక మ్యూజిక్ డైరెక్టర్ రమణ గోగుల ఈ సాంగ్ పాడడంతో సంగీత ప్రియులు సైతం ఆసక్తి కనపరుస్తున్నారు. 1990ల చివరలో మరియు 2000ల ప్రారంభంలో రమణ సంగీతంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తమ్ముడు, ప్రేమంటే ఇదేరా, బద్రి, యువరాజు వంటి చిత్రాలు ఆయన్ను టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా మార్చాయి. ముఖ్యంగా పవన్ – రమణ గోగుల కలయికలో వచ్చిన సూపర్ హిట్ సాంగ్స్ ఇప్పటికి అలరిస్తుంటాయి. మూడు దక్షిణ భారత భాషలలో సుమారు 25 చిత్రాలకు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కంపోజ్ చేశాడు. అలాంటి రమణ గోగుల..18 ఏళ్ల తర్వాత వెంకటేష్ తో జత కలవబోతున్నాడు. వెంకటేష్ (Venkatesh) తో గతంలో ల‌క్ష్మీ, ప్రేమంటే ఇదేరా చిత్రాలకు వర్క్ చేసాడు. ఇక ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం తో రాబోతున్నాడు. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో ..చూడాలంటే డిసెంబర్ 03 వరకు ఆగాల్సిందే.

Read Also : Demolition Man : రేవంత్ ‘కూల్చివేత మనిషి’ అంటూ BJP సెటైర్లు..