డ్రగ్స్ వలలో బాలీవుడ్.. సంజయ్ దత్ నుంచి ఫర్దీన్ ఖాన్ దాకా..!

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం.. విందులు, వినోదాలు సెలబ్రిటీలకు చాలా కామన్. టెన్షన్ ఫ్రీనో.. మరే ఇతర కారణాలో తెలియదు కానీ.. మత్తుకు బానిస అయ్యేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. హీరోలే కాదు.. హీరోయిన్లు సైతం ఆ మత్తులో ఊగుతున్నారు. ఇండియాలో డ్రగ్స్ కు సంబంధించిన ఏ వార్త వినిపించినా మొదట అందరి చూపు బాలీవుడ్ వైపు పై పడుతుంది. అయితే అప్పటి సంజయ్ దత్ నుంచి ఫర్దీన్ ఖాన్ దాకా ఎంతోమంది డ్రగ్స్ వలలో పడినవారే.. ఒకసారి బాలీవుడ్ చరిత్రను పరిశీలిస్తే...

  • Written By:
  • Updated On - October 5, 2021 / 11:17 AM IST

సినిమా అంటేనే గ్లామర్ ప్రపంచం.. విందులు, వినోదాలు సెలబ్రిటీలకు చాలా కామన్. టెన్షన్ ఫ్రీనో.. మరే ఇతర కారణాలో తెలియదు కానీ.. మత్తుకు బానిస అయ్యేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. హీరోలే కాదు.. హీరోయిన్లు సైతం ఆ మత్తులో ఊగుతున్నారు. ఇండియాలో డ్రగ్స్ కు సంబంధించిన ఏ వార్త వినిపించినా మొదట అందరి చూపు బాలీవుడ్ వైపు పై పడుతుంది. అయితే అప్పటి సంజయ్ దత్ నుంచి ఫర్దీన్ ఖాన్ దాకా ఎంతోమంది డ్రగ్స్ వలలో పడినవారే.. ఒకసారి బాలీవుడ్ చరిత్రను పరిశీలిస్తే…

తొమ్మిదేళ్లు ఆ నరకంలో..

బాలీవుడ్ లో డ్రగ్స్ ప్రస్తావన రాగానే అందరి కళ్లు సంజయ్ దత్ పైనే పడుతాయి.  చాలామంది హీరోలు డ్రగ్స్ తీసుకుంటున్నప్పటికీ.. ఏ ఒక్కరూ కూడా ఒప్పుకోరు. కానీ సంజయ్ దత్ తన డ్రగ్ వ్యవహరం గురించి చాలా గట్టిగా చెప్పాడు. సిమి గారెవాల్ చాట్ షోలో తాను కాలేజీ సమయంలోనే డ్రగ్స్ తీసుకున్నట్టు తేల్చి మరి చెప్పాడు. ఆ మత్తు నుంచి ఎన్నోసార్లు బయటపడే ప్రయత్నం చేసినా.. వీలు కాదని పలుమార్లు పబ్లిక్ గానే చెప్పాడు. ఒకటి కాదు… రెండు కాదు.. దాదాపు తొమ్మిదేళ్లు నరకం అనుభవించానని సంజయ్ అన్నాడు.

మత్తుకు బానిసై.. తెరమరుగై..

ప్రముఖ నటుడు ఫిరోజ్ ఖాన్ కుమారుడు అయిన ఫర్దీన్ ఖాన్ ఫిదా సైతం డ్రగ్స్ బానిస అయ్యినవాడే. ‘‘నో ఎంట్రీ, హేయ్ బేబీ’’ లాంటి చిత్రాలలో అలరించిన ఈయన బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు. స్టార్ హోదా వచ్చిందనో, మరే ఇతర కారణాలో కానీ డ్రగ్స్ బారిన పడ్డాడు. అంతగా సవ్యంగా సాగుతున్న అతని జీవితంలోకి డ్రగ్స్ ప్రవేశించాయి. మెల్లమెల్లగా మొదలైన డ్రగ్స్ వాడకం.. ఒక్కసారిగా తీవ్రస్థాయికి చేరింది. తొమ్మిది గ్రాముల కొకైన్‌తో ముంబై పోలీసులకు పట్టుబడ్డాడు కూడా. దీంతో పోలీసులు మే 5, 2001 న అరెస్టు చేశారు. డ్రగ్స్ అలవాటును వదిలించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఫర్దీన్ త్వరలోనే రీంఎంట్రీ ఇవ్వనున్నాడు. దాదాపు పదకొండేళ్ల తర్వాత రితీష్ దేశ్ ముఖ్ నటించిన సంజయ్ గుప్తా విస్ఫాట్ తో రీఎంట్రీకి సిద్ధమయ్యాడు.

 

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే..

బాలీవుడ్ హీరోలే కాదు.. కొంతమంది హీరోయిన్లు సైతం డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. మమతా కులకర్ణి అందం, అభినయం ఉన్న నటి. ఆమె యాక్ట్ చేసిన మూవీ ఏదైనా సరే ప్రేక్షకులు కచ్చితంగా చూసేవాళ్లు. అలాంటి క్రేజీ హీరోయిన్ సైతం డ్రగ్స్ బారిన పడింది. 2018 జూన్ లో పోలీసులు దేశంలోనే అతిపెద్ద డ్రగ్ రాకెట్‌లో నటిగా నిందితురాలిగా పేర్కొన్నారు. రికార్డు స్థాయిలో  పోలీసులు ఆమె నుంచి 20 టన్నుల ఎఫిడ్రిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో పోలీసుల దాడిలో రూ .2,000 కోట్ల విలువైన డ్రగ్స్ జప్తు కావడం గమనార్హం.

గంజాయి తీసుకున్న బాలీవుడ్ జంట

గతేడాది భారతి సింగ్, ఆమె భర్త హర్ష్ లింబాచియాపై కూడా ఎన్నో అభియోగాలున్నాయి. తరచుగా డ్రగ్స్ వాడుతున్నారని ఆరోపణలు రావడంతో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అరెస్ట్ కూడా చేసింది. ఆ సమయంలో పెద్ద ఎత్తున డ్రగ్స్ రికవరీ కూడా జరిగింది. పోలీసుల విచారణలో గంజాయి తీసుకున్నట్లు అంగీకరించారు. ఏకకాలంలో పోలీసులు ఆమె ఇళ్లు, ఆఫీస్ లో సోదాలు జరపగా.. 86.5 గ్రాముల గంజాయి లభించింది. దీంతో చట్టరీత్యా వాళ్లిద్దరిని అరెస్టు చేయాల్సి వచ్చింది.

డ్రగ్స్ మాయలో బిగ్ బాస్ కంటెస్టెంట్

అర్మాన్ కోహ్లీ.. హిందీ బిగ్ బాస్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. జానీ దుష్మన్, ప్రేమ్ రతన్ ధన్ పయో.. మూవీస్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అర్మాన్ కూడా మత్తు పదార్థాలకు బానిసగా మారాడు. ఈ ఏడాది ఆగస్టులో ఆర్మాన్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన ఇంట్లో డ్రగ్స్ ప్యాకెట్లు సైతం దొరికాయి.

సుశాంత్ సింగ్ రాజు పుత్ మరణంతో..

నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ నే కాదు.. తెలుగు, తమిళ్ ఇండ్రస్ట్రీలను సైతం బాధించింది. అయితే సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై దర్యాప్తు చేయగా, విస్తుపోయిన విషయాలు వెలుగుచూశాయి. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిని NCB విచారించగా.. దాదాపు 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు ప్రస్తావనకు వచ్చయి. దీపికా పదుకొనే, సారా అలీ ఖాన్, రాహుల్ ప్రీత్ సింగ్, శ్రద్ధా కపూర్ వంటి పెద్ద పేర్లు ప్రముఖంగా వినిపించాయి. 2019 లో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన పార్టీలో సైతం డ్రగ్స్ వాడినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఆ పార్టీకి దీపికా పదుకొనే, రణ్‌బీర్ కపూర్, విక్కీ కౌశల్ లాంటివాళ్లు పాల్గొనడం కూడా చర్చనీయాంశంగా మారింది.