Site icon HashtagU Telugu

Salaar 2 : ‘సలార్ 2’లో కేజీఎఫ్ నటుడు కనిపించబోతున్నాడా..? నీల్ యూనివర్స్..!

Sanjay Dutt Plays A Important Role In Prabhas Salaar 2

Sanjay Dutt Plays A Important Role In Prabhas Salaar 2

Salaar 2 : ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘సలార్’. రెండు భాగాలుగా రూపొందిన ఈ చిత్రం మొదటి భాగం.. ఆల్రెడీ రిలీజయ్యి బ్లాక్ బస్టర్ సక్సెస్ ని నమోదు చేసుకుంది. దీంతో ఆడియన్స్ అంతా సెకండ్ పార్ట్ కోసం క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్నారు. కాగా మొదటి భాగం రిలీజ్ కి ముందు.. సలార్ అండ్ కేజీఎఫ్ కి కనెక్షన్ ఉందని చాలా వార్తలు వచ్చాయి.

అయితే మొదటి భాగం రిలీజ్ తరువాత సలార్ లో కేజీఎఫ్ కి సంబంధించిన ఏ కనెక్షన్ కనిపించలేదు. కేజీఎఫ్ కి సంబంధించిన ఏ పాత్ర.. సలార్ లో కనిపించలేదు. అయితే సెకండ్ పార్టులో మాత్రం కేజీఎఫ్ విలన్ సంజయ్ దత్ కనిపించబోతున్నారట. కేజీఎఫ్ రెండు భాగంలో సంజయ్ దత్ విలన్ గా ఎంట్రీ ఇచ్చి మూవీని మరో ఎత్తుకి తీసుకువెళ్లారు. ఇప్పుడు సలార్ సెకండ్ పార్ట్ లో సంజయ్ దత్ ని తీసుకు వచ్చి.. మూవీ మరింత ఆసక్తికరంగా రూపొందించబోతున్నారట.

మరి కేజీఎఫ్ విలన్ సలార్ లో చూపిస్తున్న ప్రశాంత్ నీల్.. ఏమైనా సినిమాటిక్ యూనివర్స్ ని క్రియేట్ చేస్తున్నారా..? అనే సందేహం కలుగుతుంది. మరి ప్రశాంత్ నీల్ ఏం ప్లాన్ చేస్తున్నారో చూడాలి. కాగా ఈ సెకండ్ పార్టులో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. తండ్రి కొడుకులుగా ప్రభాస్ ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. ఈ రెండు పాయింట్స్ మూవీ పై మరింత క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నాయి.

ఇది ఇలా ఉంటే, సెకండ్ పార్ట్ షూటింగ్ పై ఎటువంటి క్లారిటీ లేదు. ఇప్పటివరకు ఈ మూవీ షూటింగ్ ని స్టార్ట్ చేయలేదు. ఆగష్టు నుంచి ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ తో సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. దీంతో సలార్ షూటింగ్ ని పోస్టుపోన్ చేసినట్లు చెబుతున్నారు. ఎన్టీఆర్ సినిమా పూర్తి అయిన తరువాతే సలార్ 2 ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటి పై క్లారిటీ రావాలంటే మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సిందే.

Exit mobile version