Site icon HashtagU Telugu

Sanjay Dutt : సంజయ్ డిమాండ్ బాగుంది.. ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడో తెలుసా..?

Sanjay Dutt Hike His Remuneration For South Movies

Sanjay Dutt Hike His Remuneration For South Movies

Sanjay Dutt బాలీవుడ్ యాక్షన్ స్టార్ సంజయ్ దత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో సూపర్ ఫాం కొనసాగిస్తున్నాడు. ముఖ్యంగా సంజయ్ దత్ సౌత్ ఎంట్రీ అతనికి బాగా కలిసి వచ్చింది. కె.జి.ఎఫ్ 2 లో హీరోకి తగ్గ విలన్ గా మెప్పించిన సంజయ్ దత్ రాబోతున్న తెలుగు సినిమాల్లో విలన్ గా తన విధ్వంసం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు.

రామ్ పూరీ కాంబినేషన్ లో వస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్ ఆ సినిమాకు 8 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకున్నాడని టాక్.

కె.జి.ఎఫ్ 2 కోసం 6 కోట్లు తీసుకున్న సంజయ్ దత్ డిమాండ్ ని బట్టి పారితోషికం అన్నట్టుగా ఒకేసారి 2 కోట్లు పెంచేశాడు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ సినిమాలో కూడా సంజయ్ దత్ నటిస్తున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నటించేందుకు గాను ఏకంగా 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అడిగాడట సంజయ్ దత్. సినిమా ఎలాగు బాలీవుడ్ లో కూడా వర్క్ అవుట్ అవ్వాలని ఆయన అడిగినంత ఇచ్చేశారట.

ఇక ఇప్పుడు రామ్ చరణ్ బుచ్చి బాబు సినిమాలో కూడా విలన్ గా సంజయ్ దత్ నటిస్తాడని లేటెస్ట్ టాక్. ఈ సినిమాకు కూడా సంజయ్ దత్ 10 నుంచి 12 కోట్ల దాకా రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడట. RC 16 బడ్జెట్ విషయంలో ఎలాంటి లిమిట్స్ లేవన్నట్టు మైత్రి ప్లాన్ చేస్తున్నారట.

అందుకే సంజయ్ అడిగినంత ఇచ్చేందుకు రెడీ అంటున్నారు. రాబోతున్న ఈ సినిమాలన్నీ హిట్ అయితే సంజయ్ కి సౌత్ ఇండస్ట్రీ మరో బిగ్ బొనాంజా అవనుందని చెప్పొచ్చు.

Also Read : Om Bheem Bush Collections : బాక్సాఫీస్ పై ఓం భీమ్ బుష్ బీభత్సం.. ఇప్పటికి ఎంత తెచ్చింది అంటే..?