Site icon HashtagU Telugu

Sanjay Dutt: జైలుకు వెళ్లే ముందు కమిట్మెంట్ పూర్తి చేసిన సంజూ

Sanjay Dutt

New Web Story Copy 2023 05 30t193251.342

Sanjay Dutt: సంజయ్ దత్ జైలుకు వెళ్లడానికి ఒకరోజు ముందు జంజీర్ సినిమా రీమేక్ కోసం డబ్బింగ్ చెప్పాడని చిత్ర దర్శకుడు అపూర్వ లఖియా గుర్తు చేసుకున్నారు. 2013లో జైలుకు వెళ్లే ముందు సంజయ్ దత్ తన కమిట్‌మెంట్‌లను పూర్తి చేశాడని తెలిపాడు. జంజీర్‌ రీమేక్‌కు డబ్బింగ్‌ ఇంట్లోనే చెప్పినట్టు ఆయన తెలిపారు.

1993 ముంబై వరుస పేలుళ్ల కేసులో సంజయ్ దత్ ఆయుధాలను సరఫరా చేసినట్టు కోర్టు తేల్చింది. ఈ నేపథ్యంలో ఆయనకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఇదిలా ఉండగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ప్రియాంక చోప్రా జంటగా నటించిన చిత్రం జంజీర్. బాలీవుడ్ లో భారీ విజయం అందుకున్న ఈ సినిమాను తెలుగులో జంజీర్ గా రీమేక్ చేశారు. అయితే తెలుగులో అనుకున్నంత విజయం సాధించలేదు. కానీ ఈ చిత్రంతో చెర్రీ బాలీవుడ్ జనాలకు పరిచయమయ్యాడు. కాగా అమితాబ్ బచ్చన్ పాత్రలో రామ్ చరణ్ నటించిన ఈ సినిమాతో రామ్ చరణ్ బాలీవుడ్ అరంగేట్రం చేశాడు. కాగా… హిందీ జంజీర్ చిత్రంలో నటించిన ప్రాణ్ పాత్రలో తెలుగు జంజీర్ లో సంజయ్ దత్ కనిపించాడు.

ఆ సమయంలో ముంబై పేలుళ్ల కేసు నడుస్తుంది. ముంబై వరుస పేలుళ్ల కేసులో దోషిగా తేలిన సంజయ్ దత్ కు శిక్ష పడింది. ఓ వైపు జంజీర్ సినిమా డబ్బింగ్ పూర్తి కాలేదు. మరోవైపు సంజయ్ దత్ మరుసటి రోజు జైలుకెళ్లాల్సి ఉంది. తాజాగా ఇదే విషయాన్నీ గుర్తు చేసుకున్నారు డైరెక్టర్ అపూర్వ లఖియా. జైలుకు వెళ్లేలోపు జంజీర్ డబ్బింగ్ పూర్తి చేయాలని సంజయ్ దత్ తనకు వ్యక్తిగతంగా ఫోన్ చేశారని అపూర్వ లఖియా వెల్లడించారు. సినిమాపై తనకున్న కమిట్మెంట్ అలాంటిది అంటూ కొనియాడారు.

Read More: Swiggy: స్విగ్గికి పండగే పండగ.. అంతా ఐపిఎల్ పుణ్యం అంటూ?