ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు (Allu Arjun Arrest)తో ఒక్కసారిగా చిత్రసీమే కాదు యావత్ సినీ ప్రేక్షకులు షాక్ లో పడ్డారు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనపై రెండు సెక్షన్ల కింద అల్లు అర్జున్‌పై కేసులు నమోదు చేసిన చిక్కడపల్లి పోలీసులు.. ఈరోజు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొద్దీ సేపటి వరకు కూడా పోలీసులు తమకు ప్రీమియర్ షో కు సంబదించిన అనుమతి కోరలేదని , హీరో వస్తున్నాడని భద్రత పెంచాలని అడగడం వంటివి చేయలేదని పోలీసులు చెపుతూ వచ్చారు. కానీ కొద్దీ సేపటి క్రితం సంధ్య థియేటర్ యాజమాన్యం కీలక లెటర్ ను రిలీజ్ చేసింది. ప్రీమియర్ షో కు సంబదించిన అనుమతులు , అలాగే హీరోకు భద్రత కావాలని పోలీసులను అనుమతి కోరినట్లు ఓ లెటర్ ను రిలీజ్ చేసింది.
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా, 4 డిసెంబర్ 2024 న రాసిన సంధ్య 70 MM థియేటర్ యాజమాన్యపు లేఖను, అల్లు అర్జున్ అరెస్టు జరిగిన తర్వాత, ఇప్పుడు విడుదల చేయడం సంచలనం సృష్టిస్తోంది. లేఖలో, పుష్ప-2 సినిమాకు భారీ ఫ్యాన్స్ రద్దీ ఉండవచ్చని భావిస్తూ, సెక్యూరిటీ బందోబస్తు కోసం 4 డిసెంబర్ 2024 న సీపీకి మునుపటి లేఖ రాశారు. అయితే, ఈ లేఖను అల్లు అర్జున్ అరెస్టు అనంతరం ఎందుకు విడుదల చేశారన్నదే ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది. గతంలో ఈ లేఖను ఎందుకు విడుదల చేయలేదో అన్నది ఒక మిస్టరీగా మారింది. ఈ లెటర్ ఆధారంగా అల్లు అర్జున్ కేసు నుండి బయట పడే ఛాన్స్ ఉందని భావించవచ్చు. తొక్కిసలాట కారణాల్లో పోలిసుల తీరు కూడా ఉన్నట్లు ఈ లెటర్ చెప్పకనే చెపుతుంది. నిజంగా ఈ లెటర్ అప్పుడే పోలీసులకు పంపించారా..? లేక ఇప్పటికిప్పుడు సిద్ధం చేసారా…? అనేది పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.
Read Also : Social Media : సోషల్ మీడియాకు జడ్జిలు దూరంగా ఉండాలి: సుప్రీంకోర్టు