Allu Arjun : అల్లు అర్జున్ ను నిలదీసిన POW సంధ్య

Allu Arjun : పేద వాళ్ల ప్రాణాలంటే సినిమా వాళ్లకు లెక్కలేదా సంధ్య నిలదీశారు. అల్లు అర్జున్ ఏమైనా త్యాగాలు చేశారా అని ప్రశ్నించారు

Published By: HashtagU Telugu Desk
Sandhya Fire Alluarjun

Sandhya Fire Alluarjun

సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampede) లో ఓ మహిళ మృతి (Woman Dies) చెందగా..ఆమె కుమారుడు చావుబ్రతుకుల్లో ఉన్నాడు. ఈ ఘటన కారకుల్లో అల్లు అర్జున్ (Allu Arjun) ఒకరని పోలీసులు కేసు నమోదు చేయడం, అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడం తో అల్లు అర్జున్ (Allu Arjun Bail) బయటకు వచ్చాడు. ఇక అల్లు అర్జున్ ను అరెస్ట్ చేయడం పై అభిమానులు , సినీ ప్రముఖులు , పలు రాజకీయ పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా..పలు ప్రజా సంఘాలు మాత్రం అల్లు అర్జున్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అర్జున్ ఉద్దేశపూర్వకంగా ఓ మహిళ మృతికి కారణం కాకపోయినా..ఆయన అరెస్ట్ తర్వాత జరుగుతున్న సంఘటనలు మాత్రం అందరిలో ఆగ్రహాన్ని పెంచుతున్నాయి.

బెయిల్ పై విడుదల తర్వాత పెద్ద ఎత్తున సినీ ప్రముఖులు ఆయన ఇంటికి వెళ్లి సపోర్ట్ చేయడాన్ని తప్పుపడుతున్నారు. ఇదే విషయాన్నీ POW అధ్యక్షురాలు సంధ్య (Sandhya) అన్నారు. పేద వాళ్ల ప్రాణాలంటే సినిమా వాళ్లకు లెక్కలేదా సంధ్య నిలదీశారు. అల్లు అర్జున్ ఏమైనా త్యాగాలు చేశారా అని ప్రశ్నించారు. ‘కొన్ని గంటలు జైల్లో ఉన్న బన్నీని పరామర్శించేందుకు ఆయన ఇంటికి ఇండస్ట్రీ వాళ్లు క్యూ కట్టారు. ఆయన ఏమైనా పోరాటాలు చేశారా? దెబ్బలు తిన్నారా? బాలుడు ఆస్పత్రిలో చావుబతుకుల మధ్య ఉంటే పరామర్శించేందుకు మీకు సమయం లేదా’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. అలాంటి ఘటనల పట్ల పబ్లిక్ ఫిగర్స్ బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని ఆమె సూచించారు. సినిమా రంగం నుంచి వచ్చిన వారందరూ సామాజిక బాధ్యతను వహించాలని, పేద ప్రజల కోసం నిలబడాలని ఆమె కోరారు.

సినీ ప్రముఖులు రాజకీయాల్లోనూ, సామాజికంగా నైతిక విలువలతో ముందుకు రావాలని ఆమె అన్నారు. ‘‘సమాజానికి నిజమైన సేవ చేయాలనుకునేవారికి మాత్రమే ఇలాంటి హోదాలు కలగాలి. తమ స్టార్ స్టేటస్‌ను తగిన విధంగా ఉపయోగించుకోవాలి’’ అని సంధ్య వ్యాఖ్యానించారు.

Read Also : Alla Nani : రేపు టీడీపీలోకి ఆళ్ల నాని

  Last Updated: 17 Dec 2024, 03:52 PM IST