Sandeep Vanga సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ సినిమాతో వస్తున్నారు. డిసెంబర్ 1న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ షురూ చేశారు. రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన ఈ సినిమా ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ స్టోరీ తో ఈ సినిమా వస్తుంది. అయితే రొటీన్ కి భిన్నంగా క్యారెక్టరైజేషన్ రాసుకోవడంలో సందీప్ వంగ దిట్ట. అర్జున్ రెడ్డి సినిమా చూసిన ఎవరికైనా అది అర్ధమవుతుంది.
We’re now on WhatsApp : Click to Join
ఇప్పుడు యానిమల్ కోసం కూడా అదే తరహా కథతో వస్తున్నాడు. అయితే యానిమల్ సినిమాకు కేవలం డైరెక్టర్ గానే కాదు ఎడిటర్ గా కూడా సందీప్ పనిచేశారట. అలా ఎందుకు అంటే తనకు ఎడిటింగ్ అంటే ఇష్టమని. డైరెక్టర్ గా ఏ సీన్ ఎంతవరకు ఉంచాలి అన్న క్లారిటీ తనకు ఉంటుంది. అందుకే తనే తన సినిమాలకు ఎడిటింగ్ చేస్తానని అన్నారు.
తన వేవ్ లెంత్ కి మ్యాచ్ అయ్యే ఎడిటర్ దొరికితే కచ్చితంగా మరొకరితో సినిమ్నా ఎడిట్ చేయిస్తానని అన్నారు. అప్పుడు తన పని కాస్త తగ్గుతుందని కూడా చెప్పారు సందీప్ వంగ. అర్జున్ రెడ్డి యానిమల్ రెండు వేరు వేరు కథలని.. హీరో క్యారెక్టరైజేషన్ కూడా వేరుగా ఉంటుందని అన్నారు.
బాలీవుడ్ లో తెరకెక్కిన యానిమల్ సినిమా పాన్ ఇండియా రిలీజ్ అవుతుంది. తెలుగులో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సినిమా ట్రైలర్ కు సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా సందీప్ వంగా యానిమల్ రికార్డులు కొడుతుందని చెప్పొచ్చు.
Also Read : Rohit Sharma: రోహిత్ పై సంజు శాంసన్ కామెంట్స్