తెలుగు ప్రేక్షకులకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఈయన తరచూ సినిమాలకు సంబంధించిన విషయాలతో పాటు ఏదో ఒక విషయంతో వార్తల్లో నిలుస్తూనే ఉంటారు. ముఖ్యంగా కాంట్రవర్సీ వ్యాఖ్యలు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు సందీప్ రెడ్డి. కబీర్ సింగ్,యానిమల్ వంటి సినిమాలతో ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరచుకున్నారు. రెండు సినిమాలు విడుదల అయ్యి ఎంతటి సెన్సేషన్ ను క్రియేట్ చేశాయో మనందరికీ తెలిసిందే. ఈయనను బాలీవుడ్ ఎప్పటికీ మరిచిపోదు.
ఆయన దర్శకత్వం వహించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. దీంతో సందీప్.పై అక్కడి ప్రొడక్షన్ హౌస్ లే కాకుండా కొందరు దర్శకులు కూడా వారి కడుపు మంట చూపారు. అయితే, వారికి సరైన రీతిలో సందీప్ కౌంటర్స్ ఇచ్చారు. తాజాగా మరోసారి బాలీవుడ్ పై ఆయన పలు వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. షాహిద్ కపూర్‌తో తెరకెక్కించిన కబీర్ సింగ్ సినిమా గురించి సందీప్ రెడ్డి షాకింగ్ కామెంట్లు చేశారు. కబీర్ సింగ్ సినిమాలో నటించిన ఒక స్టార్ యాక్టర్ ముంబైలోని ఒక పెద్ద ప్రొడక్షన్ హౌస్‌కు ఆడిషన్స్ కోసం వెళ్తే వారు రిజక్ట్ చేశారని వంగా వెల్లడించాడు. కేవలం నా సినిమాలో ఆయన నటించిన పాపానికి వారు కాదని చెప్పారు.
ఇంతటి వివక్ష బాలీవుడ్‌లో మాత్రమే ఉంది. ఇలాంటి నిర్ణయమే రణ్‌బీర్ సింగ్ విషయంలో తీసుకోవాలని బాలీవుడ్ కు సవాల్ విసురుతున్నాను. కబీర్ సింగ్ సినిమా నటీనటులపై ప్రొడక్షన్ హౌస్ ఇంత కఠినమైన విధానాలను కలిగి ఉంటే ఎలా? ఇదే విషయాన్ని ఒకసారి రణ్‌బీర్ కపూర్‌కి కూడా చెప్పాను. విభిన్న పాత్రల కోసం ఆడిషన్స్ చేస్తూ ఇండస్ట్రీలో ఎదగాలని ప్రయత్నిస్తున్న ఒక యంగ్ టాలెంటెడ్ నటుడిపై నా వల్ల వివక్ష చూపడం నాకు చాలా బాధగా అనిపించింది అని సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. షాహిద్ కపూర్ విషయంలో చేసిన పని రణ్బీర్ కపూర్ విషయంలో చేస్తారా అంటూ సవాల్ కూడా విసిరారు..