డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి మనందరికీ తెలిసిందే. ఈయన కబీర్ సింగ్,యానిమల్ వంటి సినిమాలను తెరకెక్కించి డైరెక్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన సినిమాలకు సంబంధించిన విషయాలకంటే ఎక్కువగా కాంట్రవర్సీ విషయాల్లోనే వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల కాలంలో తరచూ ఏదో ఒక ఇంటర్వ్యూలో పాల్గొంటూ షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మొన్నటికీ మొన్న బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి వార్తల్లో నిలిచారు సందీప్ రెడ్డి వంగా.
ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కు ఒక ప్రశ్న ఎదురైంది. మీరు పాటలు లేకుండా సినిమా తీస్తారా? లేదంటే హీరో లేకుండా తీస్తారా? రెండిటిలో ఒకదాన్ని ఎంచుకోండి అని అడగగా.. దానికి సందీప్ వెంటనే సమాధానం ఇస్తూ.. హీరో లేకుండా సినిమా తీయాలనేది నా ఆలోచన. ఒకవేళ అలాంటి సినిమా తీస్తే.. నా చిత్రాలను విమర్శించిన మహిళలు దాన్ని కూడా ఇష్టపడరు. కావాలంటే ఈ విషయాన్ని నేను రాసిస్తాను. 4, 5 సంవత్సరాల్లో నేను హీరో లేకుండా సినిమా తీస్తాను. ఇప్పుడు విమర్శిస్తున్న వారంతా 5 ఏళ్ల క్రితం సందీప్ చెప్పింది. చేసి చూపించాడు అని మాట్లాడుకుంటారు అని తెలిపారు.
ఈ సందర్భంగా సందీప్ రెడ్డివంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇకపోతే సందీప్ సినిమాల విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా నటిస్తున్న స్పిరిట్ సినిమా పనుల్లో భాగంగా బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని సందీప్ రెడ్డి వంగా ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ పనుల్లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.