Site icon HashtagU Telugu

Sandeep Reddy Vanga : ప్రభాస్, విజయ్, రణ్‌బీర్, షాహిద్‌తో.. సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తానంటున్న వంగ..

Sandeep Reddy Vanga Said He Will Create Cinematic Universe With Prabhas Ranbir Kapoor Vijay Deverakonda

Sandeep Reddy Vanga Said He Will Create Cinematic Universe With Prabhas Ranbir Kapoor Vijay Deverakonda

Sandeep Reddy Vanga : టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో ఓ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్నారు. హీరో పాత్రని ఈ దర్శకుడు చూపించే విధానానికి ఆడియన్స్ తో పాటు స్టార్స్ కూడా ఫిదా అయ్యిపోయారు. దీంతో ఈ దర్శకుడితో ఒక్క సినిమా అయినా చేయాలని స్టార్స్ ఆశ పడుతుంటారు. ఇక అభిమానులు తమ ఫేవరెట్ స్టార్స్ ని సందీప్ వంగ సినిమాల్లో చూడాలనుకోవడంతో పాటు.. ఇప్పటివరకు సందీప్ తెరకెక్కించిన సినిమాలోని హీరో పాత్రలు ఒక సినిమాలో కనిపిస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నారు.

అర్జున్ రెడ్డి సినిమాలో నటించిన టాలీవుడ్ స్టార్ విజయ్ దేవరకొండ, బాలీవుడ్ స్టార్ షాహిద్ కపూర్, యానిమల్ మూవీలో నటించిన రణ్‌బీర్ కపూర్ పాత్రలు ఆడియన్స్ లో బలమైన ముద్ర వేసాయి. ఇక త్వరలో రాబోయే ప్రభాస్ పాత్ర కూడా అలానే ఉంటుందని సందీప్ వంగ చెప్పుకొస్తున్నారు. కాగా ప్రస్తుతం సినిమాటిక్ యూనివర్స్ ట్రెండ్ నడుస్తుంది. ఈక్రమంలోనే ఈ నాలుగు పాత్రలతో సందీప్ రెడ్డి వంగ సినిమాటిక్ యూనివెర్స్ వస్తే ఎలా ఉంటుందని సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు వేస్తున్నారు.

రీసెంట్ గా జరిగిన ఓ అవార్డుల ఫంక్షన్ లో సందీప్ రెడ్డి వంగకి ఈ పోస్టులని చూపిస్తూ.. ‘ఆ ఆలోచన ఏమైనా ఉందా..?’ అని ప్రశ్నించారు. దానికి సందీప్ వంగ బదులిస్తూ.. “ఇప్పటివరకు అయితే ఆ ఆలోచన లేదు. కానీ ప్రభాస్, విజయ్, రణ్‌బీర్, షాహిద్‌ ని ఒకే ఫ్రేమ్ లో కలిపి చూడడం చాలా ఇంటరెస్టింగ్ ఉంది. ఒకవేళ నాకు ఏదైనా ఐడియా తప్పకుండా ఈ నాలుగు పాత్రలతో ఓ సినిమాటిక్ యూనివర్స్ క్రియేట్ చేస్తా” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Also read : NTR : ఎన్టీఆర్ ధరించిన కొత్త వాచ్ ధర అన్ని కోట్లా..!