Spirit : స్పిరిట్ మూవీ అప్డేట్.. ప్రభాస్ షూటింగ్ లో పాల్గొనేది అప్పుడే?

  • Written By:
  • Publish Date - March 29, 2024 / 12:50 PM IST

టాలీవుడ్ హీరో ప్రభాస్ గురించి మనందరికీ తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. కాగా ప్రభాస్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలే కావడం విశేషం. ప్రస్తుతం డార్లింగ్ చేతిలో రాజాసాబ్, స్పిరిట్, సలార్ 2, కల్కి లాంటి సినిమాలు ఉన్నాయి. కాగా గత ఏడాది సలార్ మూవీతో ప్రేక్షకులను పలకరించారు ప్రభాస్. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. కాగా గత సంవత్సరం యానిమల్ సినిమాతో భారీ పాన్ ఇండియా హిట్ కొట్టిన సందీప్ వంగ తన తర్వాత సినిమాని ప్రభాస్ తో చేయబోతున్న సంగతి తెలిసిందే.

ఆల్రడీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా స్పిరిట్ అనే టైటిల్ తో సినిమాని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ కథ అని, యాక్షన్ సీన్స్ కూడా చాలా ఉంటాయని ఇటీవల సందీప్ వంగ తెలిపారు. అయితే ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. తాజాగా బాలీవుడ్ లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమా ప్రీ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ లో షూటింగ్ మొదలు పెడతాం అని తెలిపారు.

దీంతో సందీప్ వ్యాఖ్యలు వైరల్ అవ్వగా ప్రభాస్ అభిమానులు సంతోషిస్తున్నారు. ప్రభాస్ త్వరలో కల్కి 2898AD సినిమాతో రాబోతున్నాడు. ఆ తర్వాత ది రాజాసాబ్ సినిమా, ఆ తర్వాత స్పిరిట్ తో వస్తాడు. ఇటీవలే కల్కి షూట్ పూర్తి చేయగా త్వరలో రాజా సాబ్ షూట్ మొదలుపెట్టి దసరా లోపు పూర్తి చేసి అనంతరం డిసెంబర్ లో స్పిరిట్ సినిమా షూట్ మొదలుపెడతారని సమాచారం.