Sandeep Reddy Vanga మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరికి అభిమానులు కన్నా ఆరాధించే వారే ఎక్కువ ఉంటారని చెప్పొచ్చు. ముఖ్యంగా తెర మీద మెగాస్టార్ ని చూసి చాలా మంది ఇన్ స్పైర్ అయ్యి మేము కూడా మెగాస్టార్లు అవుతామని ఎంతోమంది ఇండస్ట్రీ బాట పట్టారు. వారికి అంతగా స్పూర్తి ప్రదాతగా నిలిచారు చిరంజీవి. ఇండస్ట్రీలో సగం మంది అలా చిరుని చూసి స్పూర్తి పొందినవారే.
వీరిలో మెగా కల్ట్ ఫ్యాన్స్ కొందరు మెగాస్టార్ పై తమ అభిమానాన్ని డైరెక్ట్ గా చెప్పేస్తారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న డైర్కెటర్ సందీప్ రెడ్డి వంగ కూడా మెగా వీరాభిమానే. చిరు సినిమాలు చూసి ఆయన సినిమాల మీద ఆసక్తి పెంచుకున్నారట. ఇక లేటెస్ట్ ఇంటర్వ్యూలో చిరు మాస్టర్ సినిమాలో ఆయన సిగరెట్ తాగే స్టైల్ గురించి చెప్పాడు. అంతేకాదు ఆ సినిమాలో చిరంజీవి షర్ట్ కలర్ కూడా చెప్పి మెగా ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చాడు.
We’re now on WhatsApp : Click to Join
ఎంత కల్ట్ మెగా ఫ్యాన్ అవ్వకపోతే సందీప్ వంగ అలా మాస్టర్ సినిమాలో చిరు వేసుకున్న షర్ట్.. ఆయన సిగరెట్ తాగే విధానాన్ని ప్రస్తావిస్తారు. సినిమా ఎప్పుడో 1997 లో వస్తే అదేదో నిన్న చూసిన సినిమాలాగా గుర్తు ఉంచుకుని చెప్పడం సందీ వంగ ఎంత పెద్ద మెగా అభిమానో తెలిసేలా చేస్తుంది. మెగా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సందీప్ రెడ్డి లాంటి దర్శకులు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడానికి కూడా ఆ అభిమానమే అని తెలుస్తుంది.
అర్జున్ రెడ్డి తో హిట్ అందుకుని అదే సినిమా కబీర్ సింగ్ గా తీసి బాలీవుడ్ లో కూడా హిట్ అందుకున్న సందీప్ వంగ రీసెంట్ గా యానిమల్ తో మరో అదిరిపోయే హిట్ అందుకున్నాడు. యానిమల్ సినిమా డిసెంబర్ 1న రిలీజై 900 కోట్ల వసూళ్లతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.
Also Read : Trisha : 13 ఏళ్ల తర్వాత ఎంట్రీ ఇస్తున్న త్రిష..!