Site icon HashtagU Telugu

Sandeep Kishan : భైరవ కోన భలే ప్లాన్ వేశారుగా.. ఆ హిట్ ఫార్ములా కలిసి వస్తుందా..?

Sandeep Kishan Ooru Peru Bhairava Kona Paid Premiers Planning

Sandeep Kishan Ooru Peru Bhairava Kona Paid Premiers Planning

సందీప్ కిషన్ (Sandeep Kishan) వర్ష బొల్లమ్మ జంటగా వి.ఐ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని అనుకున్నా రవితే ఈగల్ కోసం ఆ డేట్ వదిలి ఫిబ్రవరి 16న రిలీజ్ లాక్ చేశారు. వి.ఐ ఆనంద్ సినిమాలన్నీ డిఫరెంట్ కంటెంట్ తో వస్తుంటాయి. ఈ క్రమంలో భైరవ కోన సినిమా కూడా సరికొత్త కథ కథనాలతో వస్తుంది. ఈ సినిమా నుంచి వచ్చిన సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరించగా ట్రైలర్ కూడా ఇంప్రెస్ చేసింది.

ఈ సినిమా రిలీజ్ సందర్భంగా మేకర్స్ పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఈమధ్య తమ కంటెంట్ మీద భారీ నమ్మకం ఉన్న ప్రతి సినిమాను ముందు రోజు లేదా, రెండు రోజుల ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు. ఇలా పెయిడ్ ప్రీమియర్స్ వల్ల సినిమాకు ముందే పాజిటివ్ టాక్ రావడం అది సినిమా రిలీజ్ డే నాడు సినిమాకు ప్లస్ అవ్వడం జరుగుతుంది.

పెయిడ్ ప్రీమియర్స్ వేస్తున్నారు అంటే దర్శక నిర్మాతలకు తమ సినిమా మీద అపారమైన నమ్మకం ఉన్నట్టే లెక్క. సందీప్ కిషన్ ఎన్నాళ్ల నుంచో ఒక సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అది ఊరుపేరు భైరవ కోన సినిమాతో జరుగుతుందా లేదా అన్నది చూడాలి.

ఈ సినిమా సాంగ్స్ అయితే ప్రేక్షకులను బాగా అలరించాయి. సినిమాకు కూడా పాజిటివ్ టాక్ వస్తే బాగుంటుంది. సందీప్ కిషన్ మాత్రం సినిమా రిజల్ట్ మీద సూపర్ కాన్ ఫిడెంట్ గా ఉన్నాడు.