Samyuktha : మహిళల కోసం మంచి పని మొదలుపెట్టిన హీరోయిన్.. శ్రీరామ నవమి రోజు ‘ఆదిశక్తి’..

ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పలు సేవా సంస్థలు స్థాపించారు. తాజాగా అదే బాటలో హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా చేరింది.

Published By: HashtagU Telugu Desk
Samyuktha Menon Starts Adi shakti Foundation for Women

Samyuktha Menon Starts Adi shakti Foundation for Women

Samyuktha : మన సెలబ్రిటీలు సమాజం కోసం ఏదో ఒక మంచి పని చేస్తూ ఉంటారు. కొంతమంది సేవా సంస్థలు స్థాపించి వారికి తోచినంతలో సహాయం చేస్తుంటారు. ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ పలు సేవా సంస్థలు స్థాపించారు. తాజాగా అదే బాటలో హీరోయిన్ సంయుక్త మీనన్ కూడా చేరింది. మహిళల కోసం ఓ సేవా సంస్థను స్థాపించింది.

తెలుగులో భీమ్లా నాయక్, డెవిల్, బింబిసార, విరూపాక్ష.. లాంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టింది సంయుక్త. ఇప్పుడు స్వయంభుతో పాటు మరిన్ని సినిమాలు చేస్తుంది సంయుక్త. తాజాగా నేడు శ్రీరామ నవమి సందర్భంగా తన సేవా సంస్థ ‘ఆదిశక్తి’ ని ప్రకటించింది. నిస్సహాయులైన మహిళలకు అండగా నిలబడేందుకు, సమాజంలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు తన వంతు పరిష్కారం, సహాయం అందించేందుకు ఈ సంస్థని స్థాపించినట్టు తెలిపింది.

అలాగే ఈ సంస్థ ద్వారా అన్ని వయసుల మహిళలకు విద్య, ఉపాధి, శిక్షణ, ఆరోగ్యం వంటి విషయాల్లో సపోర్ట్ గా ఉంటామని, మహిళలు ఆత్మగౌరవంతో జీవించడానికి, వారి వారి రంగాల్లో రాణించడానికి ఆదిశక్తి సంస్థ అండగా ఉంటుందని తెలిపింది సంయుక్త. దీంతో అభిమానులు, పలువురు ప్రముఖులు, నెటిజన్లు సంయుక్తని అభినందిస్తున్నారు. నటిగానే కాక మంచి మనసుతో కూడా మెప్పిస్తుందని అభినందిస్తున్నారు.

 

Also Read : Kamal R Khan : సినిమాలు ఫ్లాప్ అన్నందుకు నా మీద 10 కేసులు పెట్టారు.. నటుడు సంచలన ట్వీట్..

  Last Updated: 17 Apr 2024, 04:59 PM IST