Site icon HashtagU Telugu

Samyuktha Menon : టాలీవుడ్ కొత్త లక్కీఛామ్.. బ్యాక్ టు బ్యాక్ ఏకంగా నాలుగు హిట్స్..

Samyuktha Menon gets Back to Back Four Hits

Samyuktha Menon gets Back to Back Four Hits

మన సినీ పరిశ్రమలో ఎవరైనా హీరోయిన్ వరుసగా రెండు, మూడు సినిమాలు హిట్స్ కొడితే గోల్డెన్ లెగ్, లక్కీఛామ్, లక్కీ హీరోయిన్.. ఇలా అనేక పేర్లు పెట్టేస్తారు. ఇక ఎంట్రీ నుంచి వరుసగా చేసిన ప్రతి సినిమా హిట్ అయితే ఆ హీరోయిన్ కి టాలీవుడ్(Tollywood) లో మరింత పేరు, ఫేమస్ వచ్చేస్తుంది. వరుస ఆఫర్స్ కూడా వచ్చేస్తాయి. ఇప్పుడు మలయాళ బ్యూటీ సంయుక్త మీనన్(Samyuktha Menon) పరిస్థితి కూడా అదే.

మలయాళంలో సినిమాలు చేస్తున్న సంయుక్త మీనన్ తెలుగులో భీమ్లా నాయక్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. అందులో రానా భార్యగా సైలెంట్ గా మెప్పించింది. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన బింబిసార సినిమా కూడా మంచి విజయం సాధించింది. అనంతరం ధనుష్ సరసన చేసిన సర్ సినిమా తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించడంతో సంయుక్త బ్యాక్ టు బ్యాక్ తెలుగులో హిట్స్ కొట్టి హ్యాట్రిక్ సాధించింది.

అప్పటికే సంయుక్తని గోల్డెన్ లెగ్ అంటున్నారు. తాజాగా సంయుక్త మీనన్ సాయిధరమ్ తేజ్ సరసన విరూపాక్ష సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సస్పెన్స్, థ్రిల్లర్, హారర్ అంశాలతో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులని మెప్పించి భారీ విజయం సాధించింది. దీంతో బ్యాక్ టు బ్యాక్ నాలుగు హిట్స్ సాధించింది సంయుక్త మీనన్. తెలుగులో ఎంట్రీ ఇచ్చిన దగ్గరినుంచి వరుసగా నాలుగు సినిమాలు హిట్ కొట్టడంతో అందరూ ఇప్పుడు సంయుక్తని లక్కీఛామ్ అంటున్నారు.

ఇప్పుడు టాలీవుడ్ చూపు సంయుక్తపై పడింది. ఇప్పటికే సంయుక్త చేతిలో బింబిసార 2, డెవిల్ సినిమాలు ఉన్నాయి. విరుపాక్షలో లిప్ కిస్ సీన్స్ చేసి బోల్డ్ సీన్స్ కు కూడా రెడీ అని ఇండైరెక్ట్ గా చెప్పడంతో మరిన్ని ఆఫర్స్ టాలీవుడ్ నుంచి వస్తున్నాయి.

 

Also Read :  Pooja Hegde Upset: పూజా హెగ్డేను వెంటాడుతున్న ఫ్లాపులు.. బుట్టబొమ్మ ఖాతాలో ఐదో డిజాస్టర్!