Samyukta Menon : టాలీవుడ్ పై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు.. అక్కడ నటించాలంటే కష్టం అంటూ..!

Samyukta Menon టాలీవుడ్ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకుని సౌత్ లో సూపర్ పాపులర్ అవుతున్న హీరోయిన్స్ ఒక పాయింట్ లో తెలుగు సినీ పరిశ్రమపై కామెంట్స్

  • Written By:
  • Publish Date - May 11, 2024 / 07:50 AM IST

Samyukta Menon టాలీవుడ్ సినిమాలతో స్టార్ క్రేజ్ తెచ్చుకుని సౌత్ లో సూపర్ పాపులర్ అవుతున్న హీరోయిన్స్ ఒక పాయింట్ లో తెలుగు సినీ పరిశ్రమపై కామెంట్స్ చేస్తున్నారు. వీరి లిస్ట్ లో కొత్తగా చేరింది మలయాళ భామ సంయుక్త మీనన్. మలయాళంలో ఒక మోస్తారుగా తన కెరీర్ కొనసాగిస్తున్న సంయుక్త తెలుగులో భీమ్లా నాయక్ తో ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బింబిసార తో సూపర్ హిట్ అందుకుంది. ధనుష్ తో సార్, సాయి తేజ్ తో విరూపాక్ష చేసింది.

చివరగా డెవిల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది సంయుక్త. అయితే తెలుగు సినిమాల్లో మేకప్ ఎక్కువగా వేసుకోవాల్సి వస్తుందని. అలా వేసుకోవడం వల్ల నటించడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని అంటుంది సంయుక్త. మొఖం మీద ఏదో ఉన్నట్టుగా అక్కడ మేకప్ వేస్తున్నారు. అది చాలా కష్టమనిపిస్తుందని అంటుంది అమ్మడు.

మలయాళంలో లైట్ మేకప్ వేసుకుంటామని.. కానీ తెలుగులో మేకప్ ఎక్కువగా వేస్తారని. ఈ మేకప్ వల్ల స్క్రీన్ మీద మనం ఎలా కనిపిస్తామా అని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాల్సి ఉంటుందని అంటుంది సంయుక్త. అయితే మలయాళ సినిమాలు సహజత్వానికి దగ్గరగా ఉంటాయి బడ్జెట్ కూడా తక్కువే కాబట్టి అక్కడ మేకప్ ఉన్నా లేకపోయినా నడిచిపోద్ది. కానీ తెలుగులో అలా కాదు.

బాహుబలి, RRR రేంజ్ సినిమాలు చేస్తున్న టాలీవుడ్ లో హీరోయిన్స్ కి కొంత ప్రాధాన్యత ఉంటుంది. అందుకే వారిని ఆడియన్స్ మెచ్చే విధంగా అందంగా ఫుల్ మేకప్ వేసి తయారు చేస్తుంటారు. ఈ విషయం నచ్చని కొందరు ఇలాంటి కామెంట్స్ చేస్తుంటారు. కానీ తెలుగులో వరుస హిట్లతో దూసుకెళ్తున్న సం యుక్త ఇలా తెలుగు సినిమాల్లో మేకప్ గురించి మాట్లాడటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

Also Read : Kalyan Ram : కళ్యాణ్ రామ్ మూవీ సెట్స్‌లో అగ్ని ప్రమాదం.. నిర్మాతకు భారీ నష్టం..