Site icon HashtagU Telugu

Samyukta Menon : స్టార్ సినిమా 5 కోట్ల ఆఫర్.. కాదని చెప్పి షాక్ ఇచ్చిన హీరోయిన్..!

Samyukta Menon Bollywood Offer

Samyukta Menon Bollywood Offer

Samyukta Menon స్టార్ సినిమాలో ఛాన్స్ వస్తేనే ఎగిరి గంగేస్తారు కొందరు హీరోయిన్స్. అలాంటిది స్టార్ హీరోయిన్ ఛాన్స్ వచ్చి.. అడిగిన దానికన్నా ఎక్కువ రెమ్యునరేషన్ ఇస్తానన్నా కూడా ఒక హీరోయిన్ అందుకు నిరాకరించిందని తెలుస్తుంది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు.. అతని ఆఫర్ కాదన్న హీరోయిన్ ఎవరన్నది వివరాలు చూస్తే.. మలయాళ పరిశ్రమ నుంచి వచ్చిన సంయుక్త మీనన్ తెలుగులో భీంలా నాయక్ తో ఎంట్రీ ఇచ్చింది.

ఆ సినిమాతో ఆడియన్స్ దృష్టిలో పడిన సంయుక్త ఆ తర్వాత బింబిసార సినిమాలో నటించి హిట్ కొట్టింది. ఆ తర్వాత సార్ సినిమా చేసి దాంతో కూడా సక్సెస్ అందుకుంది. సాయి తేజ్ తో చేసిన విరూపాక్ష కూడా అమ్మడి ఖాతాలో హిట్ సినిమాగా నిలిచింది. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న సంయుక్త మరోసారి కళ్యాణ్ రాం తో డెవిల్ సినిమాలో నటించింది.

ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు కానీ అమ్మడి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అయితే సంయుక్తకు కోలీవుడ్ నుంచి క్రేజీ ఆఫర్ వచ్చిందట. అక్కడ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం ఆమెను సంప్రదించారని తెలుస్తుంది. అయితే అమ్మడు సాంగ్ చేయనని చెప్పేసిందట. సంయుక్త కోసం ఏకంగా 5 కోట్ల దాకా రెమ్యునరేషన్ ఇస్తానన్నా కూడా ఆమె ఆఫర్ ని కాదనేసిందట.

ప్రస్తుతం సం యుక్త సరైన కథ దొరికితే మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది. సంయుక్త నెక్స్ట్ సినిమా ఏంటన్నది తెలుసుకోవాలని ఆడియన్స్ ఎగ్జైటెడ్ గా ఉన్నారు.