Site icon HashtagU Telugu

Samyukta Menon : డిస్ట్రర్బ్ చేయడమే పనిగా పెట్టుకున్న సంయుక్త.. క్రేజీ ఫోటో షూట్..!

Samyukta Menon Bollywood Offer

Samyukta Menon Bollywood Offer

Samyukta Menon మలయాళంలో హీరోయిన్ గా చేసే ప్రతి భామకు టాలీవుడ్ డెస్టినేషన్ పాయింట్ గా మారింది. అక్కడ కాస్త క్రేజ్ తెచ్చుకున్న ప్రతి హీరోయిన్ తెలుగు ఎంట్రీ ఇచ్చి ఇక్కడ స్టార్ డం తెచ్చుకుంటారు. మలయాళంలో సినిమాలు చేస్తూ ఆ క్రేజ్ తో తెలుగు ఎంట్రీ ఇచ్చిన మరో బ్యూటీ సంయుక్త మీనన్. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీంలా నాయక్ సినిమాలో ఛాన్స్ అందుకున్న అమ్మడు. ఆ సినిమాతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బింబిసారా, సార్, విరూపాక్ష ఇలా వరుసగా తెలుగులో హిట్లు అందుకుంది.

ఈ హిట్లతో సంయుక్త క్రేజ్ అమాంతం పెరిగింది. అమ్మడు సినిమాలో ఉంది అంటే కచ్చితంగా సినిమా పక్కా హిట్టే అనే టాక్ వచ్చేసింది. అయితే ఈమధ్యనే డెవిల్ అంటూ వచ్చిన సం యుక్తకు ఆ సినిమా ఫలితం సంతృప్తి ఇవ్వలేదు. ప్రస్తుతం సంయుక్త నిఖిల్ నటిస్తున్న స్వయంభు సినిమాలో ఛాన్స్ అందుకుంది. ఈ సినిమాతో అమ్మడు పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకోవాలని చూస్తుంది.

ఇక సినిమాల గ్యాప్ లో ఫోటో షూట్ తో అలరిస్తున్న సం యుక్త తన గ్లామర్ ట్రీట్ తో అలరిస్తుంది. సాగర కన్య డ్రెస్ లో అమ్మడు లాంగ్ డ్రెస్ లో అదరగొట్టేస్తుంది. తన ఓర చూపులతో ఫాలోవర్స్ ని ఫిదా చేస్తుంది అమ్మడు. ఆడియన్స్ ను డిస్ట్రబ్ చేయడమే తన పనిగా పెట్టుకున్న సం యుక్త తన ఫోటో షూట్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది.

ప్రస్తుతం తెలుగులో ఒక్క సినిమానే ఉన్నా ఆ ప్రాజెక్ట్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తుంది అమ్మడు. సం యుక్త వరుస సినిమాలు చేసి అలరించాలని ఆమె ఫ్యాన్స్ కోరుతున్నారు.