కామెడీ నటుడు సంపూర్ణేష్ బాబు(Sampoornesh Babu) చాలా గ్యాప్ తీసుకొని హీరోగా మళ్ళీ వస్తున్నాడు. గతంలో హీరోగా చేసిన కొన్ని సినిమాలు సక్సెస్ అవ్వకపోవడంతో కొంతకాలం గ్యాప్ వచ్చింది. మధ్యమధ్యలో కొన్ని సినిమాల్లో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చాడు సంపూర్ణేష్ బాబు. ఇప్పుడు ‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King) అనే సినిమాతో రాబోతున్నాడు.
తమిళ్ లో యోగిబాబు హీరోగా తెరకెక్కిన నెల్సన్ మండేలా సినిమాని ఇక్కడ ‘మార్టిన్ లూథర్ కింగ్’ (Martin Luther King) పేరుతో రీమేక్ చేశారు. పూజ కొల్లూరు ఈ సినిమాకు దర్శకత్వం వహించింది. అక్టోబర్ 27న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. తాజాగా ‘మార్టిన్ లూథర్ కింగ్’ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు.
ట్రైలర్ చూస్తుంటే.. ఒక ఊళ్ళో ప్రసిడెంట్ పోటీ కోసం ఇద్దరు పోటీ పడగా చెరిసమానంగా ఓట్లు వస్తున్నాయి లెక్కేసుకోని ఒక్క ఓటు కోసం హీరో దగ్గరికి వస్తే, ఓటు వేయడానికి అతనికి ఏం ఇచ్చారు, అతను ఏం చేసాడు అనేది సినిమాలో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. ఓటుకి ఉన్న విలువని కామెడీ జోడించి సందేశాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
Also Read : Prabhas: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్, ఆ హిట్ మూవీ రీరిలీజ్