Sammelanam : ప్రేమ, స్నేహం, బ్రేకప్ వంటి అంశాలు ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి. ఇక ఇలాంటి కాన్సెప్ట్‌లతో తీసే సినిమాలైనా, వెబ్ సిరీస్‌లైనా కూడా అందరినీ అలరిస్తుంటాయి. అయితే ఇలాంటి సున్నితమైన అంశాలతో చేసిన ‘సమ్మేళనం’ సిరీస్ ఈటీవీ విన్‌లోకి వచ్చింది. ఫిబ్రవరి 20 నుంచి ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ ఓటీటీలో బాగానే ట్రెండ్ అవుతోంది.
ప్రియా వడ్లమాని, గణ ఆదిత్య, విజ్ఞయ్ అభిషేక్ ప్రధాన పాత్రల్లో సునయని. బి, సాకెత్. జె నిర్మాతలుగా తరుణ్ మహాదేవ్ తెరకెక్కించిన సిరీస్ ‘సమ్మేళనం’. ప్రస్తుతం ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది. కొత్త మొహాలతో ఇలాంటి సున్నితమైన అంశాలను జోడించి డైరెక్టర్ తరుణ్ మహాదేవ్ సిరీస్‌ను అద్భుతంగా మలిచాడు. ఓటీటీ కదా అని అడల్ట్ కంటెంట్ కానీ, అడల్ట్ కామెడీని కానీ జొప్పించలేదు. దర్శకుడికి టాలీవుడ్ లో మంచి భవిష్యత్తు ఉంటుంది. క్లీన్ కామెడీతో ప్రేక్షకులను నవ్వించిన విధానం ఆకట్టుకుంది.
Read Also:ASSOCHAM : అసోచామ్, తెలంగాణ ప్రభుత్వం ఏఐ & సెక్యూరిటీ సదస్సు
ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. మూడో ఎపిసోడ్ నుంచి ఈ సిరీస్ పరుగులు పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఈ క్లీన్ సిరీస్‌కు శ్రావణ్ జీ కుమార్ విజువల్స్, శరవణ వాసుదేవన్, యశ్వంత్ నాగ్ సంగీతం ప్రధాన బలం. మరీ ముఖ్యంగా శరవణ వాసుదేవన్ బీజీఎం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రస్తుతం ఈ సిరీస్ ఈటీవీ విన్‌లో టాప్‌లో ట్రెండ్ అవుతోంది.
కాలేజీ రోజుల్లో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఎంతో ఆనందంగా గడుపుతాడు. స్వచ్ఛమైన ప్రేమను పొందుతాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల స్నేహితులు అందరికీ ఆ యువకుడు దూరమవుతాడు. ఆ తర్వాత తన కాలేజీ డేస్‌లోని మధుర జ్ణాపకాలను పంచుకుంటూ ఒక పుస్తకం రాస్తాడు. దాని పేరే సమ్మేళనం. మరి ఆ పుసక్తం దూరమైన స్నేహితులను ఎలా ఒక్కటి చేసింది? అనే కాన్సెప్ట్‌తో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. ఫుల్ యూత్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ వెబ్ సిరీస్ తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది.
కాగా, దర్శకుడు. హీరో.. రచయిత అని, ఈ కథ తన కోణంలోనే సాగుతుందని ప్రారంభ సన్నివేశంతోనే క్లారిటీ ఇచ్చేశారు. కానీ, మిగిలిన పాత్రల పరిచయానికి చాలా సమయం తీసుకున్నారు. పేపర్‌లో రామ్‌ను చూసి ఆనందంలో మునిగిపోయిన శ్రేయ.. ఇంటి పనిమనిషి (జీవనప్రియ రెడ్డి)కి తమ స్నేహితుల గురించి చెప్పే ఫ్లాష్‌బ్యాక్‌తో అసలు కథ మొదలవుతుంది. అలా శ్రేయ గత జ్ఞాపకాలు పంచుకుంటుంటే.. మధ్యమధ్యలో తర్వాతేంటి? అంటూ ఆసక్తి కనబరిచే పనిమనిషి ప్రేక్షకులకు నవ్వులు పంచుతుంది. ఆ గ్యాంగ్‌లో ఒకరితో ఒకరికి ఉన్న సంబంధమేంటో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్‌లోనే అర్థమవుతుంది.