Sameera Reddy : సినిమా ఇండస్ట్రీలో స్నేహితులు ఎవ్వరూ నాకు హెల్ప్ చేయలేదు.. చాలా బాధ వేసింది..

సమీరా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టులు, వీడియోలు పెడుతుంది. పలు ప్రమోషన్స్ కూడా చేస్తూ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి దగ్గరవుతుంది.

Published By: HashtagU Telugu Desk
Sameera Reddy says no one help me in movie Industry at that time

Sameera Reddy says no one help me in movie Industry at that time

బాలీవుడ్(Bollywood) భామ సమీరా రెడ్డి(Sameera Reddy) తెలుగులో కూడా నరసింహుడు, అశోక్, జై చిరంజీవ సినిమాల్లో నటించి మెప్పించింది. పలు తెలుగు, హిందీ సినిమాలతో మంచి హీరోయిన్ గా కొన్నాళ్ళు కెరీర్ ని నడిపింది. 2013లో సినిమాలకు దూరమయి అప్పట్నుంచి సినీ పరిశ్రమకు దూరంగానే ఉంటుంది సమీరా రెడ్డి 2014 లో పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లో బిజీ అయింది. ప్రస్తుతం సమీరాకు ఇద్దరు పిల్లలు కూడా.

అయితే సమీరా గత కొన్ని నెలలుగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. సోషల్ మీడియాలో రెగ్యులర్ గా పోస్టులు, వీడియోలు పెడుతుంది. పలు ప్రమోషన్స్ కూడా చేస్తూ మళ్ళీ సినిమా ఇండస్ట్రీకి దగ్గరవుతుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేసింది సమీరా రెడ్డి.

సమీరా రెడ్డి మాట్లాడుతూ.. సినిమాలకు దూరమయి వ్యక్తిగత జీవితంలో బిజీ అయిన నేను కొంతకాలం కింద మళ్ళీ అభిమానులతో, సినీ పరిశ్రమ వ్యక్తులతో తిరిగి కనెక్ట్ అవ్వాలనుకున్నాను. అందుకు సోషల్ మీడియా బెటర్ అని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకున్నాను. ఆ అకౌంట్ కొంచెం ప్రమోట్ చేయమని సినీ పరిశ్రమలో ఉన్న నా స్నేహితులకి కాల్ చేసి అడిగాను. ఒక్కరు కూడా నాకు హెల్ప్ చేయలేదు. ఆ విషయంలో నాకు చాలా బాధగా అనిపించింది. ఆ తర్వాత నా అకౌంట్ ని నేనే ప్రమోట్ చేసుకున్నా ఆ తర్వాత నా అభిమానులు, ప్రేక్షకులే నన్ను ప్రమోట్ చేశారు అని తెలిపింది. మరి సమీరా అడిగినా హెల్ప్ చేయని ఆ సినీ పరిశ్రమ స్నేహితులు ఎవరో..

 

Also Read : Google Doodle-Sridevi : శ్రీదేవిని డూడుల్ తో గౌరవించిన గూగుల్

  Last Updated: 13 Aug 2023, 06:28 PM IST